కమీషనర్, ఛైర్పర్సన్ మధ్య విభేదాలు

కమీషనర్, ఛైర్పర్సన్ మధ్య విభేదాలు

కమిషనర్, చైర్పర్సన్ మధ్య విభేదాలు

అభివృద్ధి విషయంలో తలెత్తిన వివాదం..?

తమకు సహకరించడం లేదంటున్న కౌన్సిలర్లు....

సెలవుపై వెళ్లేందుకు కమిషనర్ నిర్ణయం...!

కలెక్టర్ అంగీకరించకే వెనక్కి..?

చురకలు ప్రతినిధి, జగిత్యాల, అక్టోబర్ 7 : జగిత్యాల మున్సిపాలిటీలో వస్తున్న కమిషనర్లు కొద్ది నెలలకే బదిలీ చేయించుకుంటున్నారు. తాజాగా కొత్తగా వచ్చిన కమిషనర్ కు, చైర్పర్సన్ కు మధ్య విభేదాలు కొనసాగుతున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుత కమిషనర్ అభివృద్ధి విషయంలో తమకు సహకరించకపోవడంపై చైర్పర్సన్ పట్టణ కౌన్సిలర్లతో సంతకాలు ఆ మధ్యనే సేకరించగా, దీంతో కమిషనర్ సెలవుపై వెళ్లడానికి కలెక్టర్ ను కలువగా కలెక్టర్ తిరస్కరించినట్లు సమాచారం.

గత కమిషనర్ అనిల్ కుమార్ వివాదస్పద భూమి కేసులో రిమాండ్...

గత కమిషనర్ గా ఉన్న అనిల్ కుమార్ ఓ వివాదస్పద భూమి కేసులో ఇరుక్కొని దీర్ఘకాలిక సెలవుపై వెళ్లారు. కేసు విచారణ చేపట్టిన అధికారులు ఆయనను రిమాండ్ చేయించారు. అనంతరం ఆయన స్థానంలో హైద్రాబాద్ సెక్రటరీయేట్లో పని చేస్తున్న సమ్మయ్య జగిత్యాల మున్సిపల్ కమిషనర్ బదిలీపై వచ్చారు. ఆయన వచ్చిన కొద్ది రోజుల వరకు పాలకవర్గంతో కలిసిమెలసి ఉన్నప్పటికి ఆతరువాత అభివృద్ధి పనుల విషయంలో కమిషనర్ తమకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని పాలకవర్గంలో ఆరోపణలు వ్యక్తమయ్యాయి. చెత్త
సేకరణకు వాహనాలు గ్యారేజీలో ఉన్నప్పటికి మరమ్మత్తులు చేయించడం లేదని, పనులు సక్రమంగా నిర్వహించడం లేదని, అనుకూలంగా ఉన్న వారికీ పనులు అప్పగిస్తున్నారని ఆరోపణలు గుప్పుమన్నాయి. ఈ నేపథ్యంలోనే కమిషనర్ను బదిలీ చేయించేందుకు కౌన్సిలర్లతో సంతకాలు చేయించినట్లు తెలుసుకున్న కమిషనర్ తాను సెలవుపై వెళ్లాలని కలెక్టర్ ను కోరినట్లు, కలెక్టర్ అంగీకరించలేదని, అతి పెద్ద మున్సిపాలిటీ కావడంతో సెలవు నిరాకరించినట్లు సమాచారం. కాగా మళ్లీ కమిషనర్, చైర్పర్సన్ల మధ్య విభేదాలను
తోలగించడానికి చేసిన ప్రయత్నాలు ఫలిస్తున్నాయని కొందరు నాయకులు చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికి అభివృద్ధి విషయంలో వివాదాలు చోటు చేసుకోవడం ఇబ్బందికరంగా మారింది. అభివృద్ధి విషయంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ లు చొరవ తీసుకొని మున్సిపాలిటీని అభివృద్ధి పర్చేలా అటు పాలకవర్గాన్ని, ఇటు కమిషనర్ ను 
పిలిపించుకొని మున్సిపల్ అభివృద్ధికి సత్వర చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

ప్రజావాణికి ఆలస్యంగా హజరైన కమిషనర్...

ఉన్నతాధికారులకు కమిషనర్ నిర్లక్ష్యపు సమాధానం....

ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి జగిత్యాల మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య ఆలస్యంగా హజరు కాగా ఉన్నతాధికారులు ఈ విషయమై ఆయనను ప్రశ్నించగా ఆయన నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చినట్లు తెలిసింది. ముందస్తు సమాచారం ఇవ్వకుండా ప్రజావాణికి ఆలస్యంగా రావడంపై ఉన్నతాధికారులు కమిషనర్ ను ప్రశ్నించగా తానూ గ్రూప్1 అధికారినే అంటూ నిర్లక్ష్యపు సమాధానం ఇచ్చినట్లు తెలిసింది.

మున్సిపల్ అధికారులపై ప్రజావాణిలో ఫిర్యాదు...

జగిత్యాల పట్టణంలోని చింతకుంట వాడకు చెందిన అదిల్ సుభాన్ తనకు ఇంటి పర్మిషన్ ఉన్న ఇంటి నిర్మాణం చేపట్టకుండా కమిషనర్, టిపిఓలు అడ్డుకుంటున్నారని, తనకు షోకాజ్ నోటీసులు ఇచ్చారని సోమవారం ప్రజావాణిలో జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదుపై ఉన్నతాధికారులు మున్సిపల్ అధికారుల పై అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది.IMG-20241007-WA0013

Tags:

Related Posts