డిస్టెన్స్ ఎడ్యుకేషన్ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

డిస్టెన్స్ ఎడ్యుకేషన్ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

డిస్టెన్స్ ఎడ్యుకేషన్ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

చురకలు విలేఖరి IMG-20240922-WA0034
జగిత్యాల: డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూివర్సిటీ లో ప్రస్తుతం కోర్సు చేస్తున్న, కోర్స్ పూర్తి చేసిన డిస్టెన్స్ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం కరీంనగర్ అంబెడ్కర్ స్టడీ సెంటర్ లో జరిగింది. ఈ ఆత్మీయ సమ్మేళనంలో  స్టడీ సెంటర్ ఎడి రాజేందర్ రెడ్డి ని ఘనంగా సన్మానించి సత్కరించారు. వారికి జాయింట్ డైరెక్టర్ గా పదోన్నతి పొందిన సందర్భంగా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ విద్యార్థులు ఈ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సన్మాన కార్యక్రమంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల డిస్టెన్స్ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు  విద్యార్థులు మాట్లాడుతూ ఏడి రాజేందర్ రెడ్డి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Related Posts