జిల్లా డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో రూ: 25 లక్షల విలువ గల 106.6 కిలోల గంజాయి దహనం: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

జిల్లా డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో రూ: 25 లక్షల  విలువ గల 106.6  కిలోల గంజాయి దహనం:  జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

IMG-20240928-WA0018 డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో రూ: 25 లక్షల  విలువ గల 106.6  కిలోల గంజాయి దహనం:  జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ 

చురకలు విలేఖరి 
జగిత్యాల, సెప్టెంబర్,28

జగిత్యాల జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీసు స్టేషన్ లలో నమోదైన 43 కేసుల్లో నిందితుల నుండి సీజ్ చేసిన ప్రభుత్వ నిషేధిత గంజాయి 106.6 -కిలోలను, ఎన్ పీ డీ ఎస్ చట్ట ప్రకారం జిల్లా డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో  ఇన్సినిరేషన్ ప్రక్రియ ద్వారా పర్యావరణ కాలుష్య నియంత్రణ నిబంధనలను పాటిస్తూ దహనం చేయడం జరిగిందని,  దహనం చేసిన గంజాయి విలువ సుమారు 25  లక్షలు  రూపాయలు ఉంటుందని జిల్లా ఎస్పీ  వివరించారు. జిల్లా డ్రగ్ డిస్పోజల్ కమిటీ చైర్మన్ గా జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ , కమిటీ సభ్యుల గా  అదనపు ఎస్పీ  భీమ్ రావు , ఎస్ . బీ ,డిఎస్పీ  రవీంద్ర కుమార్, రిజర్వ్ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ ఉండడం జరిగింది. 

ఈ సందర్భంగా ఎస్పీ  మాట్లాడుతూ.. ఎన్ పీ డీ ఎస్ యాక్ట్ లోని నియమనిబంధనల ప్రకారం జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో నమోదు చేయనడిన 43  కేసులలో నిల్వ ఉన్న గంజాయిని దహనం చేయడం జరిగిందని తెలియజేసారు. కొందరు అక్రమార్జనలో భాగంగా, గంజాయి సాగు, విక్రయిస్తూ పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని యువతను ప్రలోభాలకు గురి చేస్తూ మత్తులోకి దించుతున్నారన్నారు.అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడే వారిని అరికట్టడం కోసం జిల్లా వ్యాప్తంగా పోలీసుల ద్వారా విస్తృత స్థాయిలో తనిఖీలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఎవరైనా గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాలను రవాణా చేసిన, అమ్మిన, సేవించిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పి భీమ్ రావు  ,డిఎస్పీలు  రవీంద్ర కుమార్,రఘు చందర్ సిసిఎస్ ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ, సి.ఐ లు రామ్ నర్సింహారెడ్డి, రవి, కృష్ణారెడ్డి ,సురేష్ బాబు, ఆర్ ఐ కిరణ్ కుమార్,  సిబ్బంది పాల్గొన్నారు.

Tags:

Related Posts