సామాజిక మిత్రులు దాతలుగా పేద విద్యార్థుల చదువులకు విరాళాలు

సామాజిక మిత్రులు దాతలుగా   పేద విద్యార్థుల చదువులకు విరాళాలు

సామాజిక మిత్రులు దాతలుగా 
 పేద విద్యార్థుల చదువులకు విరాళాలు
............................................
 రామ కిష్టయ్య సంగన భట్ల
. ..................................
ఊహించని భర్త మరణం, వెంటాడుతున్న 
 పేదరికం మూలంగా కటిక దారిద్ర్యాన్ని అనుభవిస్తూ, 
సంసార సాగరాన్ని దాటించే క్రమంలో 
 ఒక అభాగ్యురాలు  తన ముగ్గురు పిల్లలను ఉన్నత చదువులు చదివించడం ఇబ్బంది పడుతున్న వేళ .. నిరుపేద మహిళ కుటుంబానికి ఫేస్ బుక్ మిత్రులు రూ. 1.53 లక్షలు విరాళాలు అందించి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. ధర్మపురి నియోజక వర్గం, వెల్గటూర్ మండలంలోని రాజారాం పల్లె గ్రామానికి చెందిన దర్శనాల జమున , రాజేష్ దంపతులకు ఇద్దరు కుమారులు, ఓ కుమారుడు ఉన్నారు. భర్త గతంలో మరణించడంతో  జమున కూలి పని చేస్తూ తలకు మించిన భారంతో 
ముగ్గురు పిల్లల్ని చదివిస్తున్నది.
 
తమ ముగ్గురు పిల్లలు చదువుల్లో రాణి 
స్తున్నప్పటికీ పేదరికం కారణంగా 
 ఇబ్బందులు పడుతున్నారు. కూతురు 
ఎం బీ బి ఎస్ మూడవ సంవత్సరం చదువుతుండగా, పెద్ద కుమారుడు ఎం బి ఏ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు.  చిన్న కుమారుడు బి టెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. వీరికి ఆయా కోర్సుల్లో ఫ్రీ సీట్ లభించినప్పటికీ హాస్టల్ ఫీజు, చదువు కోవడం ఇబ్బందికరంగా మారింది. 

వీరి దీనస్థితిని తెలుసుకున్న ధర్మపురికి చెందిన సామాజిక సేవకులు రేణికుంట రమేష్ స్పందించి సదరు పేద విద్యార్థులకు ఉన్నత చదువుల కోసం సాయం అందించాలని సెప్టెంబర్ 3 న ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. దాంతో తన మిత్రులైన ఎన్నారైలు స్పందించి జమున బ్యాంక్ ఖాతాలు రూ. 1.53 లక్షలు విరాళాలు అందించారు. వాటిలో ప్రస్తుత ఖర్చుల కోసం కొంత మొత్తాన్ని  స్థానిక సి ఐ రాం నర్సింహరెడ్డి చేతుల మీదుగా జమునకు ఇప్పించారు. మిగతా డబ్బులు ఆమె ఖాతాలో నిల్వ ఉన్నట్లు రమేష్ తెలిపాడు. సి  ఐ వెంట ఎస్సై మహేష్ , యూనియన్ బ్యాంక్ మేనేజర్ అషిష్ ఉన్నారు.IMG-20240930-WA0020

Tags:

Related Posts