దేశ నిర్మాణంలో విద్యార్థుల పాత్ర కీలకం ఆల్పోర్స్ విద్య సంస్థల చైర్మన్ డాక్టర్ వి. నరేందర్ రెడ్డి
దేశ నిర్మాణంలో విద్యార్థుల పాత్ర కీలకం
అల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ డా.వి.నరేందర్ రెడ్డి
చురకలు విలేఖరి
కరీంనగర్, సెప్టెంబర్ 22: దేశ నిర్మాణంలో విద్యార్థుల పాత్ర కీలకమని అల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మస్ డా.వి.నరేందర్ రెడ్డి అన్నారు. ఆదివారం కరీంనగర్ పట్టణంలోని కొత్తపల్లి అల్ఫోర్స్ కళాశాలలో దేశ నిర్మాణంలో విద్యార్థుల పాత్ర అనే అంశంపై ప్రముఖ వ్య క్తిత్వ వికాస నిపుణులు, నటుడు కెవి. ప్రదీప్కుమార్తో కలసి అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ వ్య క్తిత్వ వికాస నిపుణులు, నటుడు కెవి.ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులకు వారి హక్కులు, విధుల గురించి తెలియజేసి, వారి ప్రతిభను గుర్తించి అవకాశాలు కల్పించి నైతిక విలువల గురించి తెలియజేయాలన్నారు. ప్రతి విద్యార్థి వారు ఏర్పర్చుకున్న లక్ష్యాలను సాధించి తల్లిదండ్రులను తృప్తిపర్చాలన్నారు. ప్రతి విద్యార్థి చక్కన్ని గుణాలను అలవర్చుకోవాలని, అనుకున్న లక్ష్యాలకు అనుగుణంగా చదవాలని సూచించారు. సమయాన్ని వృధా చేయకుండా ఉత్తమంగా ఉండాలన్నారు. అనంతరం అల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ డా.వి.నరేందర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు దేశాభివృద్ధికి మూలమని, చక్కన్ని గుణాలు పొంది ఉత్తమంగా ఉండాలన్నారు.
ఎందరో మహానుభావులు పుట్టిన ఈ దేశంలో మీరు కూడా అదే రీతిలో ఉండి. సమాజాభివృద్ధిలో పాలుపంచుకోవాలన్నారు. తల్లిదండ్రుల ఆశయాలను వమ్ముచేయకుండా విద్యార్థులు లక్ష్యాలకు అనుగుణంగా చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు. దేశ బాధ్యతలు చక్కగా నిర్వర్తించినప్పుడే చరిత్రలో నిలిచిపోతారన్నారు. ఈ కార్యక్రమంలో ఇపిజి ఫౌండర్ శివప్రసాద్, కళాశాల ప్రిన్సిపల్, విద్యార్థులు పాల్గొన్నారు.

