వెల్గటూర్ పోలిస్ స్టేషన్ ను తనిఖి చేసిన డీఎస్పీ
వెల్గటూర్ పి ఎస్ ను తనిఖీ చేసిన డిఎస్పీ రఘుచందర్.
అంకిత భావంతో విధులు నిర్వహించాలని సూచన.
చురకలు,విలేఖరి, వెల్గటూర్, నవంబర్ 11.
పోలీసులు అంకిత బావంతో విధు లు నిర్వహించాలని జగిత్యాల డిఎస్పీ రఘుచందర్ సూచించా రు.వార్షిక తనిఖీల్లో భాగంగా ఆయన సోమవారం వెల్గటూర్ పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసి పోలీస్ స్టేషన్ రికార్డ్స్,సిడి ఫైల్స్, ఇతర రికార్డులనుపరిశీలించారు. పోలీస్ స్టేషన్ లో ఎక్కువగా నమో దయ్యే కేసుల వివరాలను ఆరాతీ శారు. పోలీసు స్టేషన్ పరిసరాలను పర్యవేక్షించి పోలీస్ స్టేషన్ నిర్వహ ణ, స్టేషన్లలో 5S ఇంప్లిమెంటేషన్, ఫంక్షనల్ వర్టీకాల్స్ గురించి కోర్ట్ డ్యూటీ , రిసెప్షన్ , బిసి,పెట్రోల్ మొబైల్, టెక్ టీమ్స్ పనితీరు గురించి స్టేషన్ సిబ్బందితో మాట్లా డి, సమస్యల గురించి తెలుసుకు న్నారు.సిబ్బందికి ఏమైనా సమస్య లుంటే తన దృష్టికి తీసుకురావల న్నారు. సైబర్ నేరాల విషయంలో ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. శాంతిభధ్రత ల పరిరక్షణ, మహిళా సమస్యల పరిష్కారం ప్రాధాన్యతగా విధులు నిర్వహించాలని ఆదేశించారు. నేరాల నియంత్రణకై పోలీస్ పెట్రోలింగ్, విజిబుల్ పోలీసింగ్ నిర్వహించాలన్నారు. లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తే సంఘటన లపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నేర నియంత్రణలో భాగంగా పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రతి గ్రామం లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని అందుకు అనుగుణంగా ప్రజలకి వాటి ద్వారా కలిగే ప్రయోజనాలని అవగాహన కల్పించాలన్నారు. స్టేషన్ పరిధిలో జరిగే చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలపై కఠినంగా వ్యవహారించాలని, చట్ట పరమైన చర్యలు తీసుకోవాలన్నా రు. భూ విషయాల్లో జోక్యం చేసు కోవద్దని అదేశిస్తూ కోర్ట్ ల ద్వారా సమస్యలని పరిష్కారం చేసుకునే విధంగా ప్రజలకి సూచించాలని పోలీసులకు తెలిపారు.ఈ కార్య క్రమం లో ధర్మపురి సిఐ రామ్ నర్సింహారెడ్డి , వెల్గటూర్ ఎస్సై ఉమా సాగర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

