ప్రజ్ఞ గ్లోబల్ సీబీఎస్ఇ స్కూల్కు డైనమిక్ అవార్డు
By: Mohammad Imran
On
ప్రజ్ఞ గ్లోబల్ సీబీఎస్సి స్కూల్ కు డైనమిక్ అవార్డు
జగిత్యాల :
డైనమిక్ స్కూల్స్ ఎడ్యుకేషన్ అవార్డు 2024 వారు హైదరాబాద్ లో నిర్వహించిన కార్యక్రమంలో డైనమిక్ స్కూల్ అవార్డు 2024 జగిత్యాల జిల్లాలో గల ప్రజ్ఞ గ్లోబల్ సీబీ ఎస్ సి పాఠశాలకు లభించింది. అవార్డును పాఠశాల ప్రిన్సిపల్ అనిల్ నిర్వాహకుల నుండి అందుకున్నారు. ఈ సందర్భంగా చైర్మన్ జనగాం అనిల్ మాట్లాడుతూ రాష్ట్రస్థాయిలో ప్రజ్ఞ గ్లోబల్ స్కూల్ అవార్డు సొంతం చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయమని పేర్కొన్నారు . ఉపాధ్యాయుల విద్యార్థుల వారి తల్లిదండ్రుల ప్రోత్సాహంతో అవార్డు సొంతం చేసుకున్నట్లు తెలిపారు. అవార్డుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ జనగం అనిల్, ప్రిన్సిపల్ అనిల్, ఇంచార్జ్ రాజశేఖర్,ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Tags:

