ముందస్తు బతుకమ్మ సంబురాలు

ముందస్తు బతుకమ్మ సంబురాలు

ముందస్తు బతుకమ్మ సంబరాలు 

రకరకాల వేషధారణలతో ఆకట్టుకున్న విద్యార్థులు 

జగిత్యాల IMG-20240930-WA0012
జగిత్యాల జిల్లా కేంద్రంలోని స్లేట్ హైస్కూల్లో సోమవారం రోజు ముందస్తు బతుకమ్మ సంబరాలు నిర్వహించారు.ఈ సందర్భంగా విద్యార్థినిలు రకరకాల పూలతో బతుకమ్మను అలంకరించి వివిధ వేషధారణలతో  ఆటపాటలతో అంగరంగ వైభవంగా ముందస్తు బతుకమ్మ పండుగను జరుపుకున్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పాఠశాల ప్రిన్సిపల్ స్వప్న మాట్లాడుతూ బతుకమ్మ' పండుగను తెలంగాణా రాష్ట్రంలో ఆశ్వయుజ మాస శుద్ధ పాడ్యమి నుండి తొమ్మిది రోజుల పాటు ఆడబిడ్డలు పెద్ద ఎత్తున ఎంతో ఆప్యాయతతో జరుపుకుంటారు. ఈ బతుకమ్మ (గౌరి) పండుగ లేదా సద్దుల పండుగ దసరాకి రెండు రోజుల ముందు వస్తుంది.తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత బతుకమ్మను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ స్వప్న తల్లిదండ్రులకు పోషకులకు ఉపాధ్యాయులకు విద్యార్థిని విద్యార్థులకు ముందస్తు బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ జగన్మోహన్ రెడ్డి, డైరెక్టర్లు తిరుపతిరెడ్డి , రాజ్యలక్ష్మి, ఇంచార్జ్ మల్లికార్జున్ మరియు ఉపాధ్యాయ బృందం విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Related Posts