ఉద్యోగులు జేఏసీ నాయకలతో ఉద్యోగుల సమస్యల పరిష్కారం కొరకు చర్చలకు పిలవండి మాజాహిద్ హుస్సేన్
ఉద్యోగుల జేఏసీ నాయకులతో ఉద్యోగుల సమస్యల పరిష్కారం కొరకు చర్చలకు పిలవండి
గెజిటెడ్ ఆఫీసర్స్ నాన్ గెజిటెడ్ టీచర్స్ పెన్షనర్స్ కార్మికుల రాష్ట్ర జాయింట్ యాక్షన్ కమిటీ కార్యదర్శి మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి
చురకలు విలేఖరి
హుజరాబాద్, సెప్టెంబర్,27
రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ శాఖలలో పనిచేస్తున్న ప్రభుత్వం ఉద్యోగుల సమస్యల పరిష్కారం కొరకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు క్యాబినెట్ మంత్రులు మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చీఫ్ సెక్రటరీ శాంతకుమారి వెంటనే ప్రభుత్వ ఉద్యోగుల కొన్ని సంవత్సరాల నుండి పెండింగ్లో ఉన్న అన్ని రకాల సమస్యల పరిష్కారం కొరకు తెలంగాణ ఉద్యోగుల జేఏసీ నాయకులతో వెంటనే చర్చలు జరపడానికి పిలువాలని తెలంగాణ గజిటెడ్ ఆఫీసర్స్ నాన్ గెజిటెడ్ టీచర్స్ కార్మికుల రాష్ట్ర జాయింట్ యాక్షన్ కమిటీ కార్యదర్శి మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మరియు క్యాబినెట్ మంత్రులతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ శాంత కుమారి వెంటనే తెలంగాణ ఉద్యోగుల జేఏసీ నాయకులతో ప్రభుత్వం ఉద్యోగుల సమస్యల పరిష్కారం కొరకు వెంటనే చర్చలకు పిలువాలని మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ విజ్ఞప్తి చేశారు గత బి ఆర్ ఎస్ ప్రభుత్వంలో పెండింగ్ లో ఉన్న డి ఏ లు పిఆర్సి కి సంబంధించిన ఐఆర్ మరియు తెలంగాణ రాష్ట్రంలో దాదాపు సంవత్సరం క్రితం ఏర్పడిన నూతన కాంగ్రెస్ ఐ పార్టీ ప్రభుత్వం హయాంలో అయినా తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు పరిష్కారం అవుతాయని దాదాపు 12 లక్షల మంది ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు తెలంగాణ రాష్ట్రములో ఏర్పడిన కాంగ్రెస్ ఐ పార్టీ ప్రభుత్వం పేద ప్రజల కొరకు మంజూరు చేస్తున్న సంక్షేమ పథకాలను అన్ని గ్రామీణ పట్టణాల మండలాల రెవెన్యూ డివిజన్లలో జిల్లా కేంద్రాలలో అంతట ఆ పథకాలు అమలైనట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు 24 గంటలు కృషి చేస్తూనే ఉన్నారు ప్రభుత్వ ఖజానాకు రివ్యూ తేవడానికి ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో కృషి చేస్తున్నారు అలాంటప్పుడు ప్రభుత్వ ఉద్యోగులను కూడా తమ కుటుంబ సభ్యులగా చూసుకోవలసిన బాధ్యత కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని ఈ సందర్భంగా తెలంగాణ గజిటెడ్ ఆఫీసర్ నాన్ గెజిటెడ్ టీచర్స్ పెన్షనర్స్ కార్మికుల రాష్ట్ర జాయింట్ యాక్షన్ కమిటీ కార్యదర్శి మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు

