గ్యారెంటీలు అమలు చేయకున్నా ప్రజల ప్రాణాలకైనా రక్షణ కల్పించండి దావా వసంత సురేష్

గ్యారెంటీలు అమలు చేయకున్నా ప్రజల ప్రాణాలకైనా రక్షణ కల్పించండి దావా వసంత సురేష్

అరు గ్యారంటీలు అమలు చేయకున్నా...కనీసం ప్రజల ప్రాణాలకైనా రక్షణ కల్పించండి...

జిల్లా వ్యాప్తంగా విషజ్వరాలు విజ్రుభిస్తున్నాయి.

ఓట్లేసి గెలిపించిన పాపానికి ప్రజల ప్రాణాలు పోతున్నాయి.

వరుస మరణాలపై ప్రభుత్వానికి కనీసం పట్టింపు లేదు.. 

కేసీఆర్ పాలనలో శానిటేషను పై శ్రద్ధ.

అల్లీపూర్ లో చిన్నారి మరణం కలచివేసింది
     -దావ వసంతసురేష్ 


చురకలు విలేఖరి 
జగిత్యాల, అక్టోబర్,01

జగిత్యాల జిల్లాలో శానిటేషన్ నిర్లక్ష్యంతో విజృంభిస్తున్న విషజ్వరాలపై  బిఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొన జిల్లా పరిషత్ తొలి చైర్ పర్సన్ దావ వసంత సురేష్ 

*ఈ సందర్బంగా వసంత సురేష్ మాట్లాడుతూ...*తొమ్మిది నెలలు పూర్తయినా ప్రభుత్వం పాలన మెరుగు పడలేదని,
రాయికల్ మండలం అల్లీపూర్ లో 11 ఏళ్ల చిన్నారి జ్వరంతో బాధ పడుతూ చనిపోయిన ఘటన కలిచివేసిందన్నారు.
జగిత్యాల జిల్లా వ్యాప్తంగా విషజ్వరాలు ప్రభాళుతున్న ప్రాణాలు పోతున్న ప్రభుత్వం, అధికారులకు పట్టడం లేదన్నారు.
డెంగ్యూ పాజిటివ్ లు వచ్చిన వైద్యులు కనీసం అందుబాటులో ఉండడం లేదని,
బ్లీచింగ్ పౌడర్ కు బదులు సున్నం చాలుతూ మామా: అనిపించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.
ఓట్లేసి గెలిపించిన పాపానికి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని చీమ కుట్టినట్లు లేదన్నారు.
 కేసీఆర్ పాలన లో సీజనల్ వ్యాధులపై విస్తృతంగా శానిటేషన్ ప్రక్రియను వేగవంతం చేశారని,
వానకాలం సీజన్ ముగిసిన రైతు భరోసా అందలేదని,పూర్తి స్థాయిలో రుణమాఫీ కాలేదని అన్నారు.
విత్తనం పెట్టి చేతికి వచ్చే టైం వచ్చిన కనీసం సౌకర్యాలు అందడం లేదని 
 ఇచ్చినా హామీలు అమలు చేయడంలో విఫలం అయ్యారని,
ఇంట్లో పెద్ద కొడుకు లాగా కేసీఆర్ ఆదుకున్నారని పేర్కొన్నారు 
వ్యక్తిగతం తప్ప, ప్రజా శ్రేయస్సు కాంక్షించిన పథకం ఎక్కడ అమలు కాలేదన్నారు.
 మహాలక్ష్మి, విద్యా భరోసా, ఫీజు రియాంబర్స్ మెంట్ విడుదల కాలేదు. అరు గ్యారంటీ లు ఒక్కటి అమలు కాలేదని,
పంచాయతీ రాజ్ మినిస్టర్ సీతక్క ని విజ్ఞప్తి చేశారు.. మా పల్లెల దుస్థితి పై సమీక్ష చేయలని,
పథకాలు అమలు చేయకున్నా ప్రాణాలను కాపాడాలని,శానిటేషన్ ని నిర్వహించాలని కోరారు.
అధికారులు ప్రజలకు సేవకులుగా ఉంటూ ప్రజలకు మెరుగైన సేవలు అందేలా చూడాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జగిత్యాల పట్టణ అధ్యక్షుడు గట్టు సతీష్,అర్బన్ మండల అధ్యక్షుడు తుమ్మ గంగాధర్,మాజీ జెడ్పీటీసీ మహేష్,పట్టణ ప్రధానకార్యదర్శి ఆనంద్ రావు,ఉపాధ్యక్షులు వొల్లెం మల్లేశం,మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శీలం ప్రియాంకప్రవీణ్,రూరల్ మండల సమన్వయ కమిటీ సభ్యులు పడిగేల గంగారెడ్డి,ఆనంద్ రావు,కౌన్సిలర్లు సమీండ్ల వాణిశ్రీనివాస్,శ్రీధర్ రెడ్డి,మహేష్ గౌడ్,అర్బన్ మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు సంగేపు ముత్తు,అర్బన్ మండల యూత్ అధ్యక్షుడు సన్హిత్ రావు,రూరల్ మండల యూత్ అధ్యక్షుడు సదానందం,ప్రధాన కార్యదర్శి బాలే చందు,పట్టణ యూత్ ఉపాధ్యక్షుడు ప్రణయ్,సెక్రటరీ నీలి ప్రతాప్,భగవాన్ రాజ్,రాయికల్ పట్టణ అధ్యక్షుడు అనిల్,మండల మహిళా అధ్యక్షురాలు స్పందన,రాయికల్ మండల సమన్వయ కమిటీ సభ్యులు బర్కం మల్లేష్,కొల్లూరి వేణు,దొంతి నాగరాజు,తదితరులు పాల్గొన్నారు...IMG-20241001-WA0005

Tags:

Related Posts