రుణమాఫీ అంకెల గారడీ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
*రుణమాఫీ అంకెల గారడీ.. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్*
*రైతు భరోసా నే రుణమాఫీ గా చూపించిన ముఖ్యమంత్రి రేవంత్ - మాజీ మంత్రి కొప్పుల*
చురకలు విలేఖరి
జగిత్యాల, సెప్టెంబర్,18
మాజీ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్ , జిల్లా బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ల ఆధ్వర్యంలో రుణమాఫీ కాని రైతులకు మద్దతుగా జగిత్యాల జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నుండి రుణమాఫీ కానీ రైతులతో కలిసి జిల్లా కలెక్టరే కు వినతి పత్రంతో పాటు రుణమాఫీ కానీ రైతుల వివరాలకు సంబంధించిన పత్రాలను అందజేశారు..
ఈ కార్యక్రమంలో కోరుట్ల శాసన సభ్యులు సంజయ్ కుమార్, మాజీ జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంత, డిసిఎంఎస్ ఛైర్మన్ ఎల్లకాలం శ్రీకాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుంకె రవి శంకర్, జెడ్పీ వైస్ చైర్మన్ హరి చరణ్ రావు, పలువురు ప్రజాప్రతినిధులు రుణమాఫీ కానీ రైతులు పాల్గొన్నారు ..
ఈ సందర్భంగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ
కాంగ్రెస్ పార్టీ అమలు కాని హామీలను ఇచ్చి చేతులు ఎత్తేసిన పరిస్థితి కనిపిస్తుంది..! రూ.2 లక్షల రుణమాఫీ గెలిచిన వెంటనే (డిసెంబరు 9) రైతుల అందరికీ ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నోట గొప్పలు ప్రజలు చెప్పిన విషయం అందరూ విన్నారనీ అన్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చి, కేవలం 40 శాతం రైతులకు రుణమాఫీ చేసి, రాష్ట్రంలో మొత్తం మంది రైతులకు రుణమాఫీ చేసినం అని ఖమ్మం మీటింగ్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతులు దులుపుకున్నాడనీ కొప్పుల ఈశ్వర్ గుర్తు చేశారు..
ముఖ్యమంత్రి ఏమో మొత్తం రైతులకు రుణమాఫీ చేసినం అంటున్నాడు.. ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, వ్యవసాయ శాఖ అధికారులు ఇగో ఇస్తం అదిగో ఇస్తం అని మాటలు చెబుతున్నారనీ అన్నారు.
ఇది ఎంత వరకు నిజం..! మీరు ఇస్తరా ఇవ్వరా.. మీరు చెప్పిన మాటలు నిలబెట్టుకుంటారా నిలబెట్టుకోరా అని ప్రశ్నించారు..
420 హామీలు ఇచ్చి ఇప్పటి వరకు ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా, ఆరు గ్యారెంటీల్లో ఒక్క ఫ్రీ బస్సు తప్పా మిగత గ్యారెంటీ ఒక్క దానిని అమలు చేయకుండా, గత ప్రభుత్వాన్ని కెసిఆర్, కెటిఆర్ ను తిట్టడం తప్పు మీకు ఇంకో పని లేదన్నారు.
జగిత్యాల జిల్లా కేంద్రంగా ఈ రోజు ప్రశ్నిస్తున్నామని
ఈరోజు వేలాది మంది రైతులు ఆవేదన తో ఉన్నారు..! వందలాది మంది రైతులు ఈరోజు కలెక్టర్ కార్యాలయం వచ్చి వినతి పత్రాన్ని కలెక్టర్ కు సమర్పించారు..
రైతులు బ్యాంకులు, ఏఓ ఆఫీస్ ల చుట్టూ తిరుగుతున్నారనారు.
ఆరోజు మీరు చెప్పారా.. రుణమాఫీ ఇన్ని నిబంధనలు అంటాయని, ఇంటికి ఒక్కరికీ అని, రేషన్ కార్డు ఉన్నవారికే రుణమాఫీ అని, రేషన్ కార్డు వద్దని ముఖ్యమంత్రి అంటాడనీ,. రేషన్ కార్డు కావాలని బ్యాంకర్లు, వ్యవసాయ అధికారులు అంటున్నారన్నారు.
అసలు కాంగ్రెస్ పార్టీ కి ముఖ్యమంత్రి కి ఒక విధానం అంటూ ఉన్నదా అని ప్రశ్నించారు..
ముఖ్యమంత్రి మొత్తం రుణమాఫీ అయిందంటాడనీ,
ఆనాడు బీఆర్‌ఎస్ సర్కారు 2018లో రూ.లక్ష వరకు రుణమాఫీకి 36.68 లక్షల లక్షల రుణమాఫీ చేసి రైతులను ఆదుకున్నామనీ అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం 23 లక్షల మంది రైతులకు 17 వేల కోట్లు రుణమాఫీ కింది మీరు ఇచ్చింది..! మీరే చెప్పిండ్రు కాదా మొత్తం 49 లక్షలు రైతులు అని, మీరు ఇచ్చింది 26 లక్షల రైతుల పరిస్థితిని ఏంటి..? అనీ ప్రశ్నించారు.
మా హయాం హయాం కంటే, కాంగ్రెస్ పాలనలో రుణమాఫీ పొందే రైతుల సంఖ్య 13 లక్షలు తగ్గిందనీ అన్నారు.
డిసెంబర్ 9. తేదీన తీసుకోమని చెప్పితిరి, రుణమాఫీ పోయింది, ఇంకో 15 రోజుల్లో పొలాలు కోతలు వస్తాయి రైతు భరోసా గురించి ఊసే లేదనీ అన్నారు.
అన్ని మాయ మాటలు దొంగ మాటలు.. కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ కి ఇచ్చిన పైసలు ఎక్కడివో రైతులకు తెలియదా.. కెసిఆర్ ఇచ్చిన రైతు బంధు పైసలే రుణమాఫీ కి 17 వేల కోట్ల రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకొని 2 లక్షల రుణమాఫీ చేసినం అని బడాయి కొడుతున్నారని అన్నారు. రైతులను మభ్య పెడుతున్నారు, మోసం చేస్తున్నారు ఇది తగదు.. రైతు లేనిదే రాజ్యం లేదు ..! రైతు ఏడ్చినా రాజ్యం బాగు పడలేదని గుర్తు చేశారు..!
బిఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన ఆడుతున్నాం... వందశాతం అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేసారు.. లేని పక్షంలో ఈ రైతు ఉద్యమం ఆగదు.. రైతు ఆవేదనను మీరు ఆపలేరు. ఎందుకు కంటే, రైతులు వాళ్ళు ఓపిక తో ఉన్నరు.! విసిగి విసిగి వేసారి ఉన్నారు.. వీరి పట్ల నిర్లక్ష్యంగా ఉంటే పరిమాణాలు తీవ్రంగా ఉంటుంది హెచ్చరించారు..

