పంట చేనుకు అక్రమ విద్యుత్ తో రైతు మృతి -సంఘటన స్థలాన్ని పరిశీలించిన సీఐ నిరంజన్ రెడ్డి

పంట చేనుకు అక్రమ విద్యుత్ తో రైతు మృతి   -సంఘటన స్థలాన్ని పరిశీలించిన సీఐ నిరంజన్ రెడ్డి

పంట చేనుకు అక్రమ విద్యుత్ తో రైతు మృతి 

-సంఘటన స్థలాన్ని పరిశీలించిన సీఐ నిరంజన్ రెడ్డి

మల్లాపూర్, సెప్టెంబర్ 19, 

 కోతుల బెడదతో పంట చేనుకు అక్రమంగా విద్యుత్ కంచెను ఏర్పాటు చేయడంతో తన పంట పోలానికి వెళ్తున్న ముతన్నకు విద్యుత్ షాక్ తగలడంతో అక్కడిక్కడే మృతి చెందగా మృతికి కారణమైన గొండ సాయన్నపై కేసు నమోదు చేసినట్లు మెట్ పల్లి సీఐ నిరంజన్ రెడ్డి తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం మల్లాపూర్ మండలంలోని కుస్తాపూర్ గ్రామానికి చెందిన జెల్ల పెద్దముత్తన్న తన వ్యవసాయ పోలంలో మందు చల్లడానికి వెళ్లి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతుకుతుండగా పక్కనే ఉన్న గొండ సాయన్న మక్కతోటలో మొహం కాలిపోయి తీవ్రగాయాలతో మృతిచెంది ఉన్నారు. కోతుల బెడద కోసం అక్రమంగా విద్యుత్ ను కంచెకు పెట్టడంతో అటువచ్చిన ముత్తాన్నా మృతికి కారణమైన గోండ సాయన్నపై అతని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సిఐ నిరంజన్ రెడ్డి దర్యాప్తు చేయగా గోండ సాయన్న పై కేసు నమోదు చేయగా ఆయన పరారీలో ఉన్నాడని, నిందితున్ని త్వరలో పట్టుకొని రిమాండ్  చేయనున్నట్లు సీఐ వివరించారు.IMG-20240919-WA0000

Tags:

Related Posts