బాధిత కుటుంబాలను పరామర్శించిన మాజీ మంత్రి కొప్పుల
By: Mohammad Imran
On
బాధిత కుటుంబాలను పరామర్శించిన మాజీ మంత్రి కొప్పుల
చురకలు విలేకరి
ఎండపల్లి సెప్టెంబర్ 17
ఎండపల్లి మండలం ముంజంపల్లి గ్రామానికి చెందిన బొమ్మగాని నాగమ్మ కూతురు ప్రేమలత గారు బత్తుల వెంకటయ్య గారు గత కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో మరణించగా వారి కుటుంబాలను మంగళవారం రోజున మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పరామర్శించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.అనంతరం అదే గ్రామానికి చెందిన
మాజీ ఎంపిటిసి పందిల్ల రాజేందర్ రెడ్డి కి ఇటీవల భుజానికి శస్త్ర చికిత్స జరుగగా అతడిని పరామర్శించారు.ఈ సందర్భంగా కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ పదవిలో ఉన్న లేకున్న ప్రతి కార్యకర్తకు అండగా భా రా స పార్టీ ఉంటది అని మనోధైర్యం ఇచ్చారు.ఈ కార్యక్రమం లో భా రా స మండల పార్టీ అధ్యక్షుడు సింహాచలం జగన్,గాజుల మల్లేశం ఎలేటి కృష్ణ రెడ్డి భా రా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Tags:

