ఉన్నత పాఠశాలలో ఉచిత దంత వైద్య శిబిరం

ఉన్నత పాఠశాలలో ఉచిత దంత వైద్య శిబిరం

IMG-20240928-WA0001

ఉన్నత పాఠశాలలో ఉచిత దంత వైద్య శిబిరం

బుగ్గారం, సెప్టెంబర్ 29: జగిత్యాల జిల్లా బుగ్గారంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం  ఏవిపిఆర్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వైద్యుడు శైలేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఉచిత దంత వైద్య శిబిరం నిర్వహించారు. పాఠశాలలోని బాల - బాలికలకు దంత పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు, టూత్ పేస్టు లు అందజేశారు. ఏడాది పాటు ఉచిత వైద్య సేవల కార్డులు కూడా పిల్లలకు జారీ చేశారు.  ఈ సందర్భంగా మండల విద్యాధికారి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ విద్యార్థులకు ఉచితంగా దంత వైద్య శిబిరం నిర్వహించడం అభినందనీయం అన్నారు.  డాక్టర్ శైలేందర్ రెడ్డిని ఈ సందర్భంగా అభినందించారు. డాక్టర్ శైలెందర్ రెడ్డి సేవలను కొనియాడుతూ శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు అన్నాడి మోహన్ రెడ్డి, విద్యావేత్త, ప్రముఖ ఉద్యమకారుడు చుక్క గంగారెడ్డి, ఉపాధ్యాయులు శ్రీనివాస్, లచ్చన్న, అశోక్, మనోహర్, రంగ శ్రీనివాస్, సతీష్, కృష్ణకుమారి, అతియ కౌసర్, సీఆర్పి పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.

Tags:

Related Posts