నిమజ్జనానికి తరలిన ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ గణపతి

నిమజ్జనానికి తరలిన ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ గణపతి

*నిమజ్జనానికి తరలిన*
*ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్  గణపతి*


 చురకలు విలేఖరి 
తిమ్మాపూర్ సెప్టెంబర్ 16

మానకొండూర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పది రోజులుగా పూజలందుకున్న గణనాథుని నిమజ్జనం సోమవారం జరిగింది. ఈ సందర్భంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మానకొండూర్ శాసనసభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పర్యావరణాన్ని దృష్టి ఉంచుకొని వినాయక చవితి పండగ రోజున మట్టి విగ్రహాన్ని ప్రతిష్టించి ప్రత్యేక పూజలు నిర్వహించిన విషయం తెలిసిందే.పూజ అనంతరం క్యాంపు కార్యాలయం నుంచి  అల్గునూరు , సదాశివపల్లి మీదుగా మానకొండూర్ చెరువు వరకు శోభాయాత్ర సాగింది.  అనంతరం గణపతి మహారాజ్ కి జై అంటూ జైజై నినాదాల మధ్య గణపతి విగ్రహాన్ని నిమజ్జనం చేశారు. 
ఈ శోభాయాత్రలో జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయ ఇంచార్జి గోపు మల్లారెడ్డి, మ్మెల్యే వ్యక్తిగత సహాయకులు మంచాల మహేందర్, పలకల శ్రీనివాస్ రెడ్డి, అజయ్ కార్యాలయ సిబ్బంది కిషన్ రెడ్డి,వాసాల తిరుపతి,పాశం లావణ్య,సంతోషి, దివ్య, రాజేశ్వరి, లక్మి,లక్ష్మణ్, శివ, శ్రీనివాస్,పార్టీ నాయకులు కనకం కుమార్, ఆశిక్ పాషా, రెడ్డి రాజు తదితరులు పాల్గొన్నారు.IMG-20240916-WA0013

Tags:

Related Posts