ఆల్పోర్స్లో ఘనంగా గాంధీజీ, శాస్త్రి జీ జయంతోత్సవాలు

ఆల్పోర్స్లో   ఘనంగా  గాంధీజీ, శాస్త్రి జీ జయంతోత్సవాలు

“అల్ఫోర్స్” లో ఘనంగా గాంధీజీ.. శాస్త్రీజీ జయంతోత్సవాలు

చురకలు ప్రతినిధి కరీంనగర్ అక్టోబర్ 2


గాంధీజీ మరియు శాస్త్రీజీ దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించారని మరియు యావత్భారతవణిని
జాగృతం చేసి స్వాతంత్ర్యం సాధించిన గొప్ప నాయకులని మరియు మహానీయులని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత

డా॥ వి.నరేందర్ రెడ్డి' స్థానిక వావిలాలపల్లిలోని అల్ఫోర్స్ విద్యా సంస్థల కేంద్రకార్యాలయంలో ఏర్పాటు

చేసినటువంటి గాంధీజీ మరియు శాస్త్రీజీ జయంతోత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అంతకుముందు

వారు ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి గాంధీజీ మరియు శాస్త్రీజీ చిత్ర పటాలకు పూలమాలలు వేసి ఘనంగా

పుష్పాంజలి ఘటించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గాంజీ మరియు శాస్త్రీజీ చాలా గొప్ప నేతలని మరియు ప్రజలను ప్రభావితం చేసిన ఆదర్శవంతులని చెప్పారు. గాంధీజి ధృడసంకల్పంతో చక్కటి కార్యాచరణ ప్రణాళికలతో ప్రజలను ఏకతాటిమీదకు తెచ్చి స్వాతంత్ర్యం సాధించిన అవసరం ఎంతగానో వుందని మరియు బ్రిటిష్ల చెరనుంచి విముక్తి పొందడంతో చాలా గొప్పదేశంగా పిలవడం జరుగుతుందని వారు చెప్పారు. వారి త్యాగాన్ని గుర్తించి మరియు లక్ష్యసాధన దృష్టిలో పెట్టుకుని రవీంద్రనాథ్ టాగూర్ వారిని మహాత్మగా పిలిచారని చెప్పారు.

లాల్ బహుదూర్ శాస్త్రిగారు చాలా సాదసీదగా జీవితాన్ని గడిపి ఇతరులకు మార్గదర్శకంగా నిలిచారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదని చెప్పారు. దేశ రెండవ ప్రధానమంత్రిగా విశిష్టసేవలను అందించి ప్రజల హృదయాలలో చెరగని ముద్రవేసుకున్నారని చెప్పారు. పేదకుటుంబం నుంచి వచ్చిన వారు స్వాతంత్య్ర ఉద్యమం పట్ల అసక్తిని కనబర్చి పాల్గొని అందరి మన్ననలను పొందారని చెప్పారు. మహాత్మగాంధీ చెపట్టినటువంటి పలు కార్యక్రమంలో పాల్గొనడానికి కంకణబద్దులై సహాకారం అందించి తన దృష్టిని ఆకర్షించాలని చెప్పారు. కేంద్రమంత్రిగా వివిధ భాద్యతలను సమర్థవంతంగా నిర్వర్తించి గొప్ప సమర్థతగల నాయకుడిగా ఖ్యాతిగడించాడని గుర్తుచేశారు.

ప్రజలందరు వారిని ఆదర్శంగా తీసుకోని వారు ఏర్పరిచిన ఆశయాలను నేరవేర్చి వారికి ఘననివాళి తెలిపినవారవుతారని చెప్పారు. గాంధీజీకి జై మరియు శాస్త్రీకి జై నినాదాలు చేసి వేడుకలకు వన్నె తెచ్చారు.

ఈ కార్యక్రమంలో విద్యసంస్థల ప్రిన్సిపాల్స్, ఉపాధ్యాయులు, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.IMG-20241002-WA0011

Tags:

Related Posts