వైభవంగా సాగిన గణేష్ నవరాత్రి ఉత్సవాలు

వైభవంగా సాగిన గణేష్ నవరాత్రి ఉత్సవాలు

అంగరంగ వైభవంగా సాగిన శ్రీ వెంకటేశ్వర కాలనీ గణేష్ నవరాత్రోత్సవాలు..


*కన్నుల పండుగ సాగిన గణపతి పూజా కార్యక్రమాలు, ,అన్నప్రసాద వితరణ, మహా నైవేద్యం, కుంకుమ పూజ , మహా దీపోత్సవం,  కోలాట కార్యక్రమాలు...


కరీంనగర్ నగరపాలక సంస్థ 8వ డివిజన్ అలుగునూర్ పరిధిలోని శ్రీ వెంకటేశ్వర కాలనీలో గల శ్రీరామ సాయి, శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయ ప్రాంగణంలో శ్రీ గణనాధుని నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. శ్రీ పంచముఖ ఆంజనేయస్వామి యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తొమ్మిది రోజులపాటు వినాయకుడి నవరాత్రి ఉత్సవ కార్యక్రమాలు కన్నుల పండుగ కొనసాగాయి. ఆలయ ప్రధాన అర్చకులు తిరునగిరి చక్రధర ఆధ్వర్యంలో  ప్రతిరోజు నిత్య పూజ కార్యక్రమాలు , కుంకుమార్చన , అన్న ప్రసాద వితరణ ,108 రకాల తో మహా నైవేద్యం, ప్రతిరోజు మహిళల దాండియా , కోలాట కార్యక్రమాలతో నవరాత్రి ఉత్సవాలను కాలనీవాసులు పండుగలా నిర్వహించారు. సోమవారం జరిగిన వినాయక నిమజ్జన కార్యక్రమం సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి  లడ్డు , కలశం వేలంపాటను చేపట్టారు.  అనంతరం  వినాయక   నవరత్రోత్సవాలకు సహకరించిన దాతలు బూట్ల రాజేంద్రప్రసాద్ , కార్పొరేటర్ సల్ల శారద రవీందర్, పసుల రాములు, కాల్వ మల్లేశం , దుర్శెట్టి సంపత్ తదితరులను యూత్ సభ్యులు ఈ సందర్భంగా శాలువాతో సన్మానించారు. అనంతరం జరిగిన వినాయక శోభాయాత్ర మహోత్సవానికి  కాలనీవాసులు, భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా యువకుల,  మహిళల నృత్యాలు, పిల్లల ఆటపాటలతో  , వినాయక దైవ నామస్మరణతో కాలనీ ప్రాంతం మార్మోగింది. నవరత్రోత్సవాల కార్యక్రమంలో శ్రీ పంచముఖ ఆంజనేయస్వామి దేవాలయ కమిటీ బాధ్యులు, శ్రీ పంచముఖ ఆంజనేయస్వామి యూత్ అసోసియేషన్ బాధ్యులు చిందం నరసయ్య , సల్ల రాజయ్య, ఐతం వెంకన్న, మల్లేశం, గడప శేఖర్, బూట్ల కర్ణాకర్, రాజేందర్ , సుధాకర్ రెడ్డి , రాజి రెడ్డి, శ్రీనివాస్, మృత్యుంజయం, బండి కుమార్, మొగిలి , చిందమ్ అంజి, సాయి,  సంతోష్, అక్షయ్, గణేష్, అనుమట్ల ప్రశాంత్, కొత్తూరు శ్రీనివాస్, జంగపల్లి వినయ్, మనోహర్, సాయి నిఖిత్, నాగరాజు, సాయి వంశీ, సాయి , రామ్ చరణ్ తదితరులతోపాటు కాలనీవాసులు భక్తులు పాల్గొన్నారు.IMG-20240916-WA0016

Tags:

Related Posts