ప్రజా సంక్షేమానికి గణేషుని ఆశీస్సులు విప్ లక్ష్మణ్ కుమార్

ప్రజా సంక్షేమానికి గణేషుని ఆశీస్సులు విప్ లక్ష్మణ్ కుమార్

ప్రజా సంక్షేమానికి గణేశుని ఆశీస్సులు 
.....................................................
 రాష్ట్ర ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ 
................................................

రామ కిష్టయ్య సంగన భట్ల
.........................................
ప్రజా సంక్షేమానికి కట్టుబడి చిత్తశుద్ధితో అంకిత భావంతో కృషి చేస్తున్న రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వానికి సంపూర్ణ ఆశీస్సులు ఆందించాలని గణేషుని ప్రార్థిస్తున్నామని 
 రాష్ట్ర ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే , డిసిసి అధ్యక్షుడు లక్ష్మణ్ కుమార్ 
అన్నారు. మంగళ వారం ధర్మపురి క్షేత్రంలో గణపతి నిమజ్జనం కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రభుత్వం ప్రతి పండగను ఘనంగా నిర్వహించే దిశగా ప్రభుత్వం 
చర్యలు గైకొంటున్నదని, తదనుగుణంగా ఏర్పాట్లు ఘనంగా చేస్తున్నదన్నారు. ధర్మపురి క్షేత్రంలో ఏర్పాట్లు భేషుగ్గా ఉన్నాయని లక్ష్మణ్ కుమార్ అభినందించారు. చైర్ పర్సన్ స, కమిషనర్ గంగాధర్, కౌండిలర్లు, నాయకులు పాల్గొన్నారు. 


నేత్ర పర్వంగా వినాయక నిమజ్జనం
..............................................
 
ధర్మపురి క్షేత్రంలో మంగళ 
వారం అర్ధరాత్రి వరకూ వినాయక నిమజ్జన వేడుకలు నేత్ర పర్వంగా జరిగాయి. పట్టణం లోని పలు కూడళ్ళలో, వాడవాడలా ప్రతిష్ఠించిన గణేశ విగ్రహాలను పట్టణ ప్రధాన రహదారి గుండా క్రమ పద్దతిన ఊరేగింపులు నిర్వహించగా, ముందుగా నంది విగ్రహ కూడలి వద్ద మున్సిపాలిటి ఆధ్వర్యంలో ఆహ్వాన వేదిక ఏర్పాటు చేసి, వివిధ మంటపాల వద్ద పూజించిన గణపతులను స్వాగతించారు. రాష్ట్ర ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్  గణపతి విగ్రహానికి ముందు కొబ్బరికాయ కొట్టి, నిమజ్జన ఊరేగింపును ప్రారంభించారు.

 స్థానిక ఇసుక స్థంభం వద్ద విహెచ్ పి ఆధ్వర్యంలో ఆహ్వాన వేదిక ఏర్పాటు చేయగా, పోలీసుల ద్వారా వివిధ గణేశ విగ్రహాలను క్రమబద్దీకరించారు. సాయంత్రం ఆరు గంటల నుండి నిమజ్జన కార్యక్రమం అర్ధ రాత్రి దాటే వరకూ కొనసాగగా, చంద్రశేఖర పంచాయతన స్థిత గణపతితో ప్రారంభించి, నిమజ్జన ఊరేగింపులో వందలాది గణేశ విగ్రహాలను భగవన్నామ స్మరణలతో, భజనలతో, నృత్యాలతో, వేద మంత్రాలతో, మంగళ వాద్యాలతో ఆబాల గోపాలం తోడురాగా ఊరే గించి, పవిత్ర గోదావరి నదీ జలాలలో నిమజ్జనం గావించి, మంగళ స్నానాలు ఆచరించారు. ముత్తయిదువులు మంగళ హారతులు చేతబూని విఘ్న నాయకులకు స్వాగతం పలికారు. గణేశ ఉత్సవ కమిటీల అధ్వర్యంలో పులిహోరాది ప్రసాదాలను భక్తులకు అందజేశారు. ముస్లిం మైనారిటీ నాయకులు కార్యక్రమాలను పర్యవేక్షిండం విశేషం. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగ కుండా పోలీసుల ఆధ్వర్యంలో కట్టు దిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. నర్సయ్యపల్లె, కోరండ్లపల్లె తదితర గ్రామాలనుండి తెచ్చిన గణ పతి విగ్రహాలను క్రమపద్దతిలో ఊరేగించి గోదావరిలో నిమజ్జనం చేశారు.IMG-20240917-WA0063

Tags:

Related Posts