వాణిజ్య పన్నుల శాఖ లొ పనిచేస్తున్న ఏసిటిఓ లకు గెజిటెడ్ హోదా కల్పించండి శ్రీధర్ బాబు కు వినతి

వాణిజ్య పన్నుల శాఖ లొ పనిచేస్తున్న ఏసిటిఓ లకు గెజిటెడ్ హోదా కల్పించండి శ్రీధర్ బాబు కు వినతి

వాణిజ్య పనుల శాఖలో పనిచేస్తున్న ఏ సి టి ఓ గజిటెడ్ హోదా వెంటనే కల్పించాలి

మంత్రి శ్రీధర్ బాబు కు ముజాహిద్ అధ్వర్యంలో వినతి 

చురకలు విలేఖరి 
కరీంనగర్, అక్టోబర్,03.

హైదరాబాద్ మినిస్టర్స్ క్వార్టర్స్ లో గురువారం రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఐటి మరియు ఇండస్ట్రీస్ శాఖ మంత్రి డి శ్రీధర్ బాబు కు తెలంగాణ వాణిజ్య పనుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ ఆధ్వర్యంలో జి ప్రభాకర్ పి ప్రవీణ్ కుమార్ జి శ్రీనివాస్ ఎం ఎం శర్మ పి అజయ్ కుమార్ కలసి గత 7 సంవత్సరాల నుండి వాణిజ్య పనుల శాఖలో పనిచేస్తున్న ఏ సి టి ఓ లకు గజిటెడ్ హోదా కల్పించాలని మంత్రి శ్రీధర్ బాబుకు విజ్ఞప్తి చేయగా డి శ్రీధర్ బాబు మాట్లాడుతూ  సమస్యను పరిష్కరించడానికి నా వంతు కృషి చేస్తానని టి సి టి ఎన్జీవో సంఘం నాయకులకు హామీ ఇచ్చారు . రాష్ట్రంలో పనిచేస్తున్న వాణిజ్య పనుల శాఖ ఏ సి టి ఓ గెజిటెడ్ హోదా కల్పించాలని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూనే ఉన్నాం గత రెండు పిఆర్సిలు ఫైనాన్స్ క్లియరెన్స్  రాష్ట్ర ప్రభుత్వ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా గ్రూప్ టు ఉద్యోగుల క్రింద వీరు వస్తారు గనుక వీరిని ఏ సి టి ఓ లకు గజిటెడ్ హోదా ఇవ్వాలని పబ్లిక్ సర్వీస్ కమిషన్ లేఖ కూడా ఇవ్వటం జరిగింది మరియు  రాష్ట్ర ప్రభుత్వ జేఏడీ సర్వీసెస్ క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది కానీ ఇప్పటివరకు  వాణిజ్య పనుల శాఖలో పనిచేస్తున్న ఏ సి టివో లకు రాకపోవటం చాలా బాధాకరమైన విషయమని  రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ బిజెపి సిపిఐ ఎంఐఎం మరియు రాష్ట్ర మంత్రులు కూడా  రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి లేఖలు కూడా రాయటం జరిగింది అయినప్పటికీ ఏ సి టి ఓ లకు గజిటెడ్ హోదా ఇప్పటివరకు కూడా రాలేదు కనుక మంత్రి డి శ్రీధర్ బాబు చొరవ తీసుకొని వెంటనే ఎ సి టి ఓ లకు గెజిటెడ్ హోదా వచ్చినట్లు ప్రయత్నించాలని మొహమ్మద్ ముజాహిద్ కోరారు.IMG-20241003-WA0002

Tags:

Related Posts