రైతులకు సహకరించడం మిల్లర్ల బాధ్యత ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్
రైతులకు సహకరించడం మిల్లర్ల బాధ్యత
............... ..............................
ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్
......................................
రామ కిష్టయ్య సంగన భట్ల
....................................
రైస్ మిల్లుల నిర్వహణ వ్యాపారం కోసమే అయినా, ధాన్యం విక్రయించడానికి వచ్చే రైతులకు సహకరించడం రైస్ మిల్లర్ల కనీస బాధ్యతగా భావించాలని రాష్ట్ర ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హితవు పలికారు. ధర్మపురి క్షేత్రంలో శ్రీ లక్ష్మీ నరసింహ ఎ సి ఫంక్షన్ హాల్ లో సోమవారం జగిత్యాల జిల్లా బాయిల్డ్ రైస్ మిల్లర్ల ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ కు ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. సన్మానితులైన ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ తమకు చేసిన సన్మానానికి కృతజ్ఞతలు తెలిపారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు గిట్టుబాటు ధర పొందేందుకు రైతులు రైస్ మిల్లులకు ధాన్యాన్ని తెస్తున్న సందర్భాలలో వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత రైస్ మిల్లర్ల పై ఉందన్నారు. తూకాలు, నాణ్యత, కట్టింగ్ విషయాలలో సహకరించాలని సూచించారు. ఇదివరకు పెద్దపెల్లి ఎమ్మెల్యే విజయ రమణా రావు చొరవతో రైస్ మిల్లర్ల బాధ్యులు హైదరాబాద్ వచ్చిన సందర్భంలో మంత్రి శ్రీధర్ బాబు, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, తాము రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ ను కలిసి మిలర్ల ఇబ్బందుల గురించి వివరించామాన్నారు. రైతులకు మిల్లర్లు సహకరిస్తే, తామూ మిల్లర్ల సమస్యల పరిష్కారం కోసం సీఎం, ఆర్థిక మంత్రి తదితరులను శ్రీధర్ బాబు ద్వారా కలిసి, వారికి చెందాల్సిన మిల్లింగ్ డబ్బుల గురించి కృషి చేస్తామన్నారు. ఏదేమైనా జిల్లా మిలర్లను పరిచయం చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు. జిల్లా భాయిల్డ్ రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షుడు రంగినేని నవీన్ రావు అధ్యక్షతన, స్థానిక మిల్లర్ రంగ శంకరయ్య నిర్వహించిన కార్యక్రమంలో పి సి సి సభ్యులు దినేష్, కాంగ్రెస్ సీనియర్ నేతలు చిలుముల లక్ష్మణ్, జక్కు రవీందర్ తదితరులు వేదికాసీనులైనారు. ఇనగంటి వినోద్ రావు, సాయిని శ్రీనివాస్ తదితరులు తమ సమస్యలను ఏకరువు పెట్టారు.

