“అల్ఫోర్స్” లో ఘనంగా బతుకమ్మ ఉత్సవ్

“అల్ఫోర్స్” లో ఘనంగా బతుకమ్మ ఉత్సవ్

“అల్ఫోర్స్” లో ఘనంగా బతుకమ్మ ఉత్సవ్

చురకలు ప్రతినిధి 
కరీంనగర్, అక్టోబర్,02

తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మకు చాలా ప్రత్యేకత ఉన్నదని మరియు విశిష్టత కలిగిన పండుగ అని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డా॥ వి.నరేందర్ రెడ్డి  ఇతర అతిధులతో కలిసి స్థానిక వావిలాలపల్లిలోని అల్ఫోర్స్ స్కూల్ ఆఫ్ జెన్నెక్ట్స్ మైదానంలో వేడుకగా నిర్వహించినటువంటి "అల్ఫోర్స్ బతుకమ్మ ఉత్సవ్" కు ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. ప్రారంభానికి ముందు వారు జ్యోతి ప్రజ్వలన చేసి బతుకమ్మ మరియు దుర్గామత విగ్రహానికి పూజ కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ పండుగ చాలా గొప్పగా జరుపుకుంటారని మరియు ప్రేమ అప్యాయత వెదజల్లుతుందని చెప్పారు. ప్రత్యేకంగా పల్లెలలో ఈ పండుగను చాలా వేడుకగా సామూహికంగా జరుపుకుంటారని తెలుపుతూ ఈ వేడుకను 9 రోజులపాటు వివిధ రకాల బతుకమ్మలతో నిర్వహించి ఆ దుర్గామాత ఆశ్శీస్సులు పొందుతారని చెప్పారు. పార్వతి నుంచి శివలింగాన్ని వేరుచేసినందుకు గాను తమ దుఃఖాన్ని తెలియజేయడానికి మెరుపర్వతంలా పూలను పేర్చి బతుకమ్మను జరపడం తరతరాలనుండి వస్తుందని చెప్పారు.

సుమారు వేయి సంవత్సరాల నుండి ఈ వేడుకను చాలా రంగురంగుల పూలతో ప్రకృతి పూలకరించే విధంగా పార్వతి దేవి సంతృప్తిపడే విధంగా సంబరాలను జరుపుకుంటారని చెప్పారు.

హాజరైన అతిథులు మాట్లాడుతూ బతుకమ్మ 9 రోజుల పాటు రోజుకు ఒక రకమైన నైవేద్యాన్ని బతుకమ్మకు సమర్పించి దీవేనెలు పొందుతారని తెలుపుతూ మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభం చేసి చివరి రోజున సద్దుల బతుకమ్మను పేర్చి పార్వతి దేవిని ప్రసన్నం చేసుకుంటారని బతుకమ్మ ఉత్సవాలలో భాగంగా దుర్గాదేవి శరన్నవరాత్రులను చాలా గొప్పగా వివిధ రకాల అమ్మవారికి ప్రీతికరమైన పూజలతో, నైవేద్యాలతో విశేషంగా జరుపుకొని కుటుంబంతో గడుపుతారని చెప్పారు.

వేడుకలలో భాగంగా అడిన కోలాట మరియు పాడిన బతుకమ్మ పాటలు చాలా అలరింప చేసాయి. సుమారు 300 మంది ఉపాధ్యాయినిలు వివిధ రకాల బతుకమ్మలతో పాల్గొని భక్తి ప్రపత్తులను చాటారు. ఈ కార్యక్రమంలో అల్ఫోర్స్ గ్రూప్ అఫ్ స్కూల్స్ & కళాశాలలకు చెందిన ప్రిన్సిపాల్స్, ఉపాధ్యాయినిలు, తల్లితండ్రులు మరియు విద్యార్థులు సిబ్బంది పాల్గొన్నారు.IMG-20241002-WA0013

Tags:

Related Posts