బుగ్గారంలో ఘనంగా దసరా ఉత్సవాలు

బుగ్గారంలో ఘనంగా దసరా ఉత్సవాలు

బుగ్గారం లో ఘనంగా దసరా ఉత్సవాలు 

జంబి చెట్టుకు పూజలు చేసిన పంచాయతీ కార్యదర్శి అక్బర్

శబాష్ అక్బర్ సాబ్ అంటూ భక్తుల ప్రశంసలు


బుగ్గారం/ జగిత్యాల జిల్లా : 

జగిత్యాల జిల్లా బుగ్గారం గ్రామం లో శనివారం దసరా ఉత్సవాలు ఘనంగా జరిగాయి. గ్రామ పంచాయతీ కార్యదర్శి యం.ఎ. అక్బర్ జంబి చెట్టుకు ప్రత్యేక పూజలు చేశారు. ఆయన పూజలు చేయడం, పంచె కట్టుడు, దసరా, బతుకమ్మ ఉత్సవాలకు ప్రత్యేక భక్తి శ్రద్ధలతో  ఘనంగా ఏర్పాట్లు చేయడం, స్వయంగా బతుకమ్మ,  - దసరా ఉత్సవాలలో ఆయన కూడా పాల్గొనడం అందరినీ సంబుర మయం చేశాయి. ఎస్సై శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు ఎలాంటి అల్లర్లు కాకుండా తగు భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. భారీ సంఖ్యలో గ్రామస్తులు, మహిళలు తరలి వచ్చి  స్వయంగా పూజలు చేసిన జంబి చెట్టుకు ఆకులు తెంపుకుని ఒకరికొకరు జంబి ఆకు పంచుకుంటూ అలాయ్ -  బలాయ్ తీసుకొని దసరా శుభా కాంక్షలు తెలుపు కున్నారు. శావ ద్వారా ఊరేగింపు గా దసరా దేవుణ్ణి తీసుకొని డప్పు సప్పుల్లతో నృత్యాలు చేస్తూ యువత, గ్రామస్తులు ఊరేగింపుగా జంబి చెట్టు వరకు వెళ్లారు.  ప్రత్యేకంగా నిర్మించిన జంబి గద్దె పై  సజీవంగా ఉన్న జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానికంగా ప్రజా ప్రతినిధులు ఎవరూ లేనందున పంచాయతీ కార్యదర్శి యం. ఎ. అక్బర్  చేతుల మీదుగా స్వయంగా పూజలు గావించారు. భారీ సంఖ్యలో తరలి వచ్చిన గ్రామస్తులు దసరా ఉత్సవాల పట్ల మెచ్చుకొని హర్షం వ్యక్తం చేశారు.IMG-20241012-WA0012

Tags:

Related Posts