సంతాప సభలో పాల్గొన్న జి వి ఆర్
మాజీ ఎంపీటీసీ ఆవాల మణెమ్మ సంతాప సభలో పాల్గొన్న జివిఆర్
చురకలు విలేఖరి వీణవంక సెప్టెంబర్ 30:
కరీంనగర్ జిల్లా వీణవంక మండల పరిధిలోని కొండపాక గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో బీఆర్ఎస్వి రాష్ట్ర నాయకుడు ఆవాల హరిబాబు నానమ్మ మాజీ ఎంపిటిసి ఆవాల మణేమ్మ మృతి చెందగా వారి కుటుంబ సభ్యులు సోమవారం సంతాప సభ ఏర్పాటు చేయగా బీ ఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జివి రామకృష్ణారావు పాల్గొని వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.వారు మాట్లాడుతూ..ఎంపీటీసీగా గ్రామానికి సేవ చేశారని వారి సేవలను కొనియాడారు. వారి కుటుంబ సభ్యులు తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారనీ అన్నారు. సంతాప సభలో కళాకారులు వారి పాటలతో ఆకట్టుకున్నారు. వీరి వెంట మాజీ ఎంపీపీ రేణుక తిరుపతి రెడ్డి, మాజీ జెడ్పిటిసి వనమాల సాధవరెడ్డి, మాజీ ఉప సర్పంచ్ రామగుండం రాజ్ కుమార్, కాసర్ల సుధాకర్, కళాకారులు రామంచ భరత్, ఆనంద్, పలువురు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

