ఉద్యమ పోరాట స్ఫూర్తి నింపిన వీర వనిత చాకలి ఐలమ్మ. , ఎస్పీ అశోక్ కుమార్

ఉద్యమ పోరాట స్ఫూర్తి నింపిన వీర వనిత చాకలి ఐలమ్మ. , ఎస్పీ అశోక్ కుమార్

ఉద్యమ స్ఫూర్తి నింపిన వీర వనిత చాకలి ఐలమ్మ

జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

చురకలు ప్రతినిధి, జగిత్యాల, సెప్టెంబర్ 26 :  తెలంగాణ సాయుద పోరాటంలో ఉవ్వెత్తున ఎగిసే ఉద్యమానికి ఊపిరి పోసి తన ప్రాణాలను త్యాగం చేసి ఉద్యమ స్ఫూర్తి నింపిన వీర వనిత చాకలి ఐలమ్మ  అని జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు  చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించుకుని  జిల్లా పోలీస్ కార్యాలయంలో ఐలమ్మ చిత్ర పటానికి ఎస్పీ  పూలమాల వేసి నివాళులర్పించారు .ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సాయుధ పోరాట కాలంలోనే తన హక్కుల సాధన కోసం, చట్టం పరిధిలో, కోర్టుల్లో న్యాయం కోసం కొట్లాడిన గొప్ప ప్రజాస్వామికవాది చిట్యాల ఐలమ్మ అన్నారు.
తెలంగాణ స్వాతంత్రోద్యమంలో, నిజాం రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వీర వనిత చాకలి ఐలమ్మ అని అన్నారు . తెలంగాణ స్వాతంత్రోద్యమ సమరయోధులను స్మరించుకోవడం మనందరి బాధ్యతని, వారి ఆశయాలను కొనసాగించాలన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ భీమ్ రావు రావు, ఏఓశశికళ, డిఎస్పీ  రవీంద్ర కుమార్, డిసీఆర్బి, ఎస్బి ఇన్స్పెక్టర్లు , శ్రీనివాస్, ఆరిఫ్ అలీ ఖాన్, ఆర్.ఐ లు రామక్రిష్ణ, వేణు, ఆర్ఎస్ఐలు, డీపీవో కార్యాలయం, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.IMG-20240926-WA0003

Tags:

Related Posts