సేవ చేయడానికే వచ్చాను.... ఒక్కసారి ఆశీర్వదించండి ఎమ్మెల్సీ అభ్యర్ధి నరేందర్ రెడ్డి

సేవ చేయడానికే వచ్చాను.... ఒక్కసారి ఆశీర్వదించండి   ఎమ్మెల్సీ అభ్యర్ధి నరేందర్ రెడ్డి

-  సేవ చేయడానికే  వచ్చాను ....ఒక్క సారి అశీర్వాదించండి

     -  ఎమ్మేల్సీ అభ్యర్థి వి.నరేందర్ రెడ్డి 

చురకలు విలేఖరి 

ధర్మారం,IMG-20240930-WA0000

సంపాదించడానికి కాదు సేవ చేయడానికే ఎమ్మేల్సి అభ్యర్థిగా బరిలో ఉన్నానని కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్,మెదక్ నియోజకవర్గ పట్టు భద్రుల ఎమ్మేల్సీ అభ్యర్థి వి. నరేందర్ రెడ్డి అన్నారు. ధర్మారం మండల కేంద్రంలోని ఒ పంక్షన్ హాల్లొ ఎర్పాటు చేసిన పట్టుభద్రులు, ఉపాధ్యాయుల సమావేశంలో పాల్గొని  అయన మాట్లాడుతూ __ నిరుద్యోగులు పట్టుభద్రుల  పక్షాన శాసనమండలిలో గళం వినిపించడానికి ఈసారి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని  ఆల్ ఫోర్స్ విద్యాసంస్థల అధినేత వి.నరేందర్ రెడ్డి అన్నారు. ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల ద్వారా ఎంతో మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి ఉన్నత భవిష్యత్తును అందించమన్నారు. ఇప్పుడు నిరుద్యోగులు పట్టభద్రులకు అండగా ఉండడానికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని తెలిపారు. నిరుద్యోగులు పట్టుభద్రుల  సమస్యల పట్ల శాసనమండలిలో ఇంతవరకు సమగ్రమైన చర్చ జరగలేదని, వారి సమస్యలపట్ల అవగాహన ఉన్న నేను వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ఎంతొ మందికి సహాయం చేస్తు తొడుగా ఉంటూ‌ ముందుకు  వెళుతున్నానని, ఆస్తులను కాపాడుకోవడానికి, సంపాదించుకొవడం కొసం రావడం లేదని సేవ చేయడానికే  మాత్రమే  వస్తున్నానని  తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి అద్వర్యంలొ జాబ్ క్యాలేడంర్ విడుదల చేశారని గుర్తు చేశారు.గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న వారు, ఇదివరకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్న వారు  కూడా ఓటు హక్కు కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న తనను నిరుద్యోగులు, పట్టుభద్రులు గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో సాన్వి అకాడమీ చైర్మన్ మునీందర్, సాయి మణికంఠ హైస్కూల్ కరస్పాండెంట్ జైన సురేష్ కుమార్, సాందీపని పాఠశాల హెడ్ మాస్టర్ శ్రీనివాస్, మహేందర్, గ్రాడ్యుయేట్లు నిరుద్యోగులు తదితరులు పాల్గొన్నారు

Tags:

Related Posts