ఆకట్టుకున్న శాకాంబరీ అలంకరణలు

ఆకట్టుకున్న శాకాంబరీ అలంకరణలు

ఆకట్టుకున్న శాకాంబరి అలంకరణలు
.........................................
  రామ కిష్టయ్య సంగన భట్ల...
...................................
ధర్మపురి క్షేత్రస్థ శ్రీరామలిం గేశ్వర ఆలయంలో నిర్వహిస్తున్న శరన్నవరాత్రి ఉత్సవ వేడుకలలో భాగంగా కూష్మాండ రూపిణియైన శ్రీశారదామాతకు ఆది వారం చేసిన శాకాంబరి అలంకరణలు విశేషంగా ఆకట్టుకున్నాయి.

శాకాంబరి ప్రత్యేకతలు

పూర్వకాలంలో భూలోకంలో అనావృష్టి సంభవించి, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురైన నేపథ్యంలో, మునీశ్వరులంతా జగన్మాతను స్తుతించి, ఆకలి దప్పులతో అలరారు తున్న ప్రజలను కాపాడాలని ప్రార్థించారు. అప్పుడు ఆది దేవత కరుణించి 'శతాక్షీదేవి'గా ప్రజలచే కొలువ బడుదునని, తన దేహం నుండి అనేక విధములైన శాకములు ఉద్భవించి, సకాల వర్షాలు కురిసి, పాడి పంటలు సమృద్ధిగా కలిగి, భూతలం సస్యశ్యామలమై సుభిక్షంగా మారి భూలోకంలో ప్రజలు సుఖ శాంతులతో వర్ధిల్లగల రని అభయ మిచ్చినట్లు పురాణ కథనాలు. అప్పటి నుండి శరన్నవ రాత్రి ఉత్సవాలలో భాగంగా అమ్మవారిని
శాకాంబరీ మాతగా అలంకరించి పూజించడం ఆచారంగా వస్తున్నది. శ్రీశాకాంబరీతి పాఖ్యానంలో తదాయ స్యాంమేహం భువి అని చండీపాఠంలో వర్ణించిన రీతిలో బెండ, ఆలు, టమాటా, దొండ ఆదిగా కూరగాయలతో మాతను ఆదివారం మాలాలంకృత గావించారు.  దేవస్థానం ఏ సీ ఈ ఓ శ్రీనివాస్ మార్గదర్శకత్వంలో,  సూపరింటెండెంట్  కిరణ్, సీ. అ.శ్రీనివాస్ ఆధ్వర్యంలో, ఆస్థాన వేదపండితులు బొజ్జా రమేశ్ శర్మ, ముత్యాల శర్మ, పాలెపు ప్రవీణ్ శర్మ నేతృత్వంలో, పాలెపు సందీప్ శర్మ, నంబి అరుణ్, అర్చకులు దేవళ్ళ విశ్వనాథ శర్మ, సాయి తదితరులు చతుష్షష్ఠి పూజలు, కన్యకా సువాసిని పూజాది ప్రత్యేక అర్చనలు చేశారు. ఈ కార్యక్రమంలో సంప్రదాయాచరణాసక్తులైన భక్తులు పాల్గొన్నారు. అలాగే శ్రీనర్మదేశ్వర మందిరంలో ప్రతిష్ఠిత దుర్గామాతకు వేద విదులైన పాలెపు చంద్రమౌళి శర్మలచే చండీ పారాయణం, చతుషష్టి పూజలు నిర్వహించగా, అశేష భక్తజనం పాల్గొ న్నారు. టిటిడి కల్యాణ మంటపంలో వంశీకృష్ణ,  తిమ్మాపూర్ గ్రామంలోనూ శ్రీసీతారామాలయంలో శరన్నవరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. దుర్గ గాయత్రి శివాలయంలో సీతారామశర్మ, వాసవి కన్యకా పరమేశ్వరీ ఆలయంలో ఒజ్జల ప్రసాద్  ఆధ్వర్యంలో చతుష్షష్టి పూజలు గావించారు.IMG-20241006-WA0004

Tags:

Related Posts