రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీలకు జగిత్యాల విద్యార్థులు

రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీలకు జగిత్యాల విద్యార్థులు

రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీలకు జగిత్యాల విద్యార్థులు

జగిత్యాల : స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరుగుతున్న రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీలకు జగిత్యాల విద్యార్థులు ఎంపికయ్యారు. ప్రజ్ఞ గ్లోబల్ స్కూలుకు చెందిన దుగ్యాల రాఘవ్ రావు,హేమ హాసిని లు శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థి గౌతమ్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించగా ప్రభుత్వ ఓల్డ్ హై స్కూల్ విద్యార్థి అఖిల్, మైనారిటీ గురుకుల పాఠశాల విద్యార్థి జాహిద్ లు సిల్వర్ మెడల్ సాధించారు. విద్యార్థులను జగిత్యాల యువజన క్రీడా ప్రాంగణంలో జగిత్యాల జిల్లా యువజన క్రీడల అధికారి డాక్టర్ రవికుమార్ అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగిత్యాల పట్టణానికి చెందిన విద్యార్థులు జిల్లా స్థాయిలో విజయం సాధించి రాష్ట్రస్థాయిలో ఎంపిక అవ్వడం అభినందనీయమని వీరు రాష్ట్రస్థాయి నుండి జాతీయస్థాయిలో పోటీలలో పాల్గొనాలని దానికి తగ్గట్టుగా కృషి చేయాలని ఎంపికైన విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కోచ్ లు నవీన్ కుమార్, వంశీకృష్ణ, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.IMG-20241108-WA0000

Tags:

Related Posts