నేడు ఉమ్మడి కరీంనగర్ జిల్లా బాక్సింగ్ సెలెక్షన్స్
నేడు ఉమ్మడి కరీంనగర్ జిల్లా బాక్సింగ్ సెలెక్షన్స్
జగిత్యాల : కరీంనగర్ జిల్లా కేంద్రంలో కరీంనగర్ జగిత్యాల సిరిసిల్ల పెద్ద పెల్లి జిల్లాలకు చెందిన బాక్సింగ్ క్రీడాకారుల సెలెక్షన్స్ బుధవారం జరగనున్నట్లు బాక్సింగ్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి జి శ్రీనివాస్, కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి సంపత్ ఒక ప్రకటనలో తెలిపారు.ఈ నెల 5,6 తేదీలలో హైదరాబాద్ లోని షేక్ పెట్ మున్సిపల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీలకు జిల్లా స్థాయి సెలెక్షన్స్ జరగనున్నట్లు తెలిపారు. ఈ నెల 2 న కరీంనగర్ లోని అంబేద్కర్ స్టేడియం లో ఉదయం 8 గంటలకు జూనియర్,సబ్ జూనియర్ సెలెక్షన్స్ జరగనున్న నేపథ్యంలో జూనియర్ సెలెక్షన్స్ కు 1జనవరి 2008 నుండి 31 డిసెంబర్ 2009 తేదీలలో సబ్ జూనియర్ సెలెక్షన్స్ కు 1జనవరి 2010 నుండి 31 డిసెంబర్ 2011 తేదీలలో జన్మించిన బాక్సింగ్ క్రీడాకారులు డేట్ అఫ్ బర్త్, పాఠశాల బోనాఫైడ్, ఆధార్ కార్డు ఫోటోలతో హాజరు కావాలని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 94417 73080 నెంబర్ లో సంప్రదించాలని కోరారు

