వయోవృద్ధులు కేసుల పై తీర్పులు
వయోవృద్ధుల కేసులపై తీర్పులు .
జగిత్యాల సెప్టెంబర్ 16: వయోవృద్ధులను కొడుకులు,కోడళ్ల వేధింపులు,నిరాదరణకు గురిచేస్తున్న కేసుల్లో జిల్లాలో కలెక్టర్ సత్య ప్రసాద్ ఆధ్వర్యంలో వయోవృద్ధుల సంరక్షణ చట్టము ట్రిబ్యునల్ చైర్మన్ అయిన జగిత్యాల డివిజన్ ఆర్డీవో పి.మధుసూదన్ వయోవృద్ధుల సంరక్షణ చట్టం కింద ఇచ్చిన తీర్పులను తెలంగాణ అల్ సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ తెలిపారు.జగిత్యాల డివిజన్ పరిథి లోని వెల్కటూర్ మండలం పాశిగామ గ్రామానికి చెందిన తల్లిదండ్రులు అత్తె మల్లయ్య, రాజవ్వలను నిరాదరిస్తున్న కుమారుడు వెంకటయ్య ప్రతి నెలా రూ.6 వేలు ఇస్తూ పోషణ,వైద్య ఖర్చులు సంరక్షణ చూసుకోవాలని,తల్లిదండ్రుల నుంచి గిఫ్ట్ డీడ్ చేసుకున్న 4 ఎకరాల భూమి నుంచి ఒక ఎకరం తండ్రి పేరిట తిరిగి పట్టా చేయించాలని ఆర్డీవో తీర్పునిచ్చారు.జగిత్యాల డివిజన్ రాయికల్ మండలం తాట్లవాయి గ్రామానికి చెందిన దడిగొప్పుల రాములు,నర్సవ్వ అనే వృద్ధ తల్లిదండ్రులను నిరాదరిస్తున్న తిరుపతి ప్రతి నెలా రూ.6 వేలు తల్లిదండ్రుల జీవితాంతం వరకు వారి బ్యాంక్ ఖాతాలో జమ చేస్తూ పోషణ సంరక్షణ బాధ్యతలు చూసుకోవాలని, ఆదేశాలు అతిక్రమిస్తే జైలు శిక్షకు గురవుతారని ఈ కేసుల్లో ఆర్డీవో విచారణ జరిపి వయోవృద్ధుల సంరక్షణ చట్టం 2007 ఛాప్టర్ -2 సెక్షన్ 9(1)(2) ప్రకారం తీర్పుల నిచ్చారు. కాగా సోమవారం జగిత్యాల పట్టణానికి చెందిన వేముల లీలావతి తన ఇద్దరు కుమారులు ,కోడళ్లు వేధింపులకు గురిచేస్తు నిరాదరిస్తున్నారని,వారి నుంచి ప్రతి నెల పోషణ వైద్య ఖర్చులు ఇప్పించాలని జిల్లా సీనియర్ సిటిజెన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ ద్వారా ఫిర్యాదు చేసింది. ఈమేరకు సంబంధించిన వారికి ఆర్డీవో నోటీసులు జారీచేశారు. ఈ కేసుల విచారణలో ఏ.ఓ.తఫజుల్ హుస్సేన్,తెలంగాణ అల్ సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్,కౌన్సెలింగ్ అధికారులు పి.సి.హన్మంత రెడ్డి ,వెల్ముల ప్రకాష్ రావు,గౌరిశెట్టి విశ్వనాథం,జగిత్యాల డివిజన్ ట్రిబ్యునల్ సెక్షన్ సహాయకులు పద్మజ,ఎఫ్.ఆర్.ఓ.కొండయ్య, జగిత్యాల డివిజన్ పరిథిలోని వివిధ మండలాల వృద్ధులైన నిరాదరణ కేసులకు సంబంధించిన తల్లిదండ్రులు,కొడుకులు,కోడళ్ళు, కూతుర్లు పాల్గొన్నారు.

