పోషక ఆహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం ఆడువాల జ్యోతి లక్ష్మణ్

పోషక ఆహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం  ఆడువాల జ్యోతి లక్ష్మణ్

పోషకాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం 

 మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్.

జగిత్యాల :

తల్లి,బిడ్డలు, కిషోర  బాలికలు పోషకాహారం తీసుకోవడం ద్వారానే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని, తద్వారా ఆరోగ్యవంతమైన సమాజం నిర్మాణం అవుతుందని జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి- లక్ష్మణ్ అన్నారు. పోషణ మాసం సందర్భంగా స్థానిక పురానిపేట బాలికల ఉన్నత పాఠశాలలో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం కిషోర బాలికలకు పోషకాహారం, వ్యక్తిగత పరిశుభ్రత పై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి- లక్ష్మణ్ మాట్లాడుతూ స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహిళలు,పిల్లల ఆరోగ్యం పై అవగాహన కల్పించి తద్వారా ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం కోసం  నెల రోజులపాటు పోషకాహారంపై అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. అంగన్వాడి కేంద్రాలలో అందించే పోషక ఆహారాన్ని అర్హులైన ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని సూచించారు. అంగన్వాడి టీచర్లు ఇచ్చే ఆరోగ్య సలహాలను పాటించాలన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న జగిత్యాల అర్బన్ సూపర్వైజర్ కవితా రాణి మాట్లాడుతూ కిశోర బాలికలు పరిసరాల పరిశుభ్రతతో పాటు వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని సూచించారు. రోజువారి ఆహారంలో సమతుల ఆహారం తీసుకోవాలన్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషక విలువలు ఉన్న ఆకుకూరలు, చిరుధాన్యాలు,పండ్లు, పాలు,కోడిగుడ్లు రోజువారి ఆహారంలో ఉండే విధంగా చూసుకోవడం ద్వారా భవిష్యత్తులో రక్తహీనత,ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ఉంటాయని తెలిపారు. అనంతరం కిశోర బాలికలతో మానవహారం నిర్మించగా మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి పోషకాహారం పై ప్రతిజ్ఞను చేయించారు. 
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజయ్య,అంగన్వాడి టీచర్లు దయావతి,యతీశ్వరి, నీలవేణి,రజిని, భాగ్యలక్ష్మి,శివప్రియ, ఏఎన్ఎం మాదేశీ శిరీష,కళావతి, ఆశా కార్యకర్త లావణ్య తదితరులు పాల్గొన్నారు.IMG-20240920-WA0008

Tags:

Related Posts