కొండా సురేఖ వ్యాఖ్యాలు ఆడ జన్మాకే కలంకం ,దావా వసంత సురేష్

కొండా సురేఖ వ్యాఖ్యాలు ఆడ జన్మాకే  కలంకం ,దావా వసంత సురేష్

*కొండా సురేఖ వ్యాఖ్యలు ఆడ జన్మకే కలంకం*

మహిళా మంత్రులను అడ్డం పెట్టుకొని బిఆర్ఎస్ పై సిఎం రేవంత్ రెడ్డి దాడి

ఎంగిలి పూల బతుకమ్మ నాడు ఎంగిలి మాటలు మాట్లాడిన కొండా సురేఖ బేషరతుగా కేటీఆర్ కు వెంటనే క్షమాపణ చెప్పాలి

-దావ వసంతసురేష్ 

చురకలు విలేఖరి 
జగిత్యాల,

బిఆర్ఎస్ పార్టీ జగిత్యాల జిల్లా కార్యాలయంలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని ఉద్దేశించి మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ మీడియాతో మాట్లాడిన జిల్లా పరిషత్ తొలి చైర్ పర్సన్ దావ వసంతసురేష్ 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ:-

కొండా సురేఖ  క్యాలి తప్పి మాట్లాడుతున్నారు..

కొండా వ్యాఖ్యలపై మాట్లాడాలంటే ఆసయంవేస్తుందని.రాజకీయాల్లో ఇలాంటి మహిళలు ఉన్నారంటే బాధగా ఉందన్నారు...

కాంగ్రెస్ పాలన వైఫల్యాలను డైవర్ట్ చేసేందుకే మహిళా మంత్రులను  శిఖండి లాగా పెట్టుకుని చిల్లర రాజకీయాలు చేస్తున్న రేవంత్ రెడ్డి

రాష్ట్ర మంత్రి హోదాలో ఉన్న కొండా సురేఖ సంస్కారహీనంగా,సినిమా పరిశ్రమను కించపరిచేలా కేటీఆర్ ను ఉద్దేశించి మంత్రి బజారు భాషాపై వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలని హెచ్చరిస్తున్నాం...

మీ హాయాంలో N కన్వెన్షన్ కూలగొట్టారు మరి మీరు ఎవరిని పంపమని డిమాండ్ చేశారు.? పంపలేదు గనుకనే కూల్చివేశారా? అని మేము విమర్శించవచ్చు..కానీ మాకు ఒక సభ్యత సంస్కారం ఉందనీ..మహిళలను గౌరవించే ఒక విధానం మాది.అందుకే అలాంటి అసభ్యకరమైన విమర్శలు చేయమన్నారు.
హైడ్రా పేరుతో సిఎం రేవంత్ రెడ్డి పేదల ఇండ్లను కూలుస్తున్నారని,ప్రజలంతా బిఆర్ఎస్ వద్దకు వచ్చి తమ గోడు వెల్లబోసుకుంటున్నారని,ఈ క్రమంలో బిఆర్ఎస్ కు వస్తున్న ఆదరణ ఓర్వలేక కేటీఆర్  పై సురేఖ ఇష్టం వచ్చినట్టు మాట్లాడారని విమర్శించారు

రాజకీయంగా ఎదురుకోలేకనే ఇటువంటి నీచ సంస్కృతికి దిగజారుతున్నారని..అరాచకాలు,అవినీతి అక్రమాలకు పెట్టింది పేరుగా కాంగ్రెస్ పార్టీ పేరు గాంచిందన్నారు...

రాష్ట్ర మహిళా కమిషన్ ఒక కాంగ్రెస్ మహిళ కమిషన్ గానే కాకుండా మహిళల పక్షాన ఉండి వెంటనే కొండా సురేఖ  మాట్లాడినటువంటి మాటల పై యాక్షన్ తీసుకోవాలన్నారు

కేటీఆర్ కు క్షమాపణ చెప్పకుంటే ఉర్కునేది లేదన్నారు.

ఈ కార్యక్రమంలో జగిత్యాల&రాయికల్ AMC మాజీ చైర్మన్లు శీలం ప్రియాంకప్రవీణ్,ఉదయ శ్రీ,రాయికల్ మండల మహిళా అధ్యక్షురాలు స్పందన,మహిళ కార్యకర్తలు  పాల్గొన్నారు...IMG-20241003-WA0008

Tags:

Related Posts