ఎల్ఐసి ఎజెంట్ల నిరసన
By: Mohammad Imran
On
ధర్మపురి ఎల్ఐసి కార్యాలయంలో ఏజెంట్ల నిరసన.
..................................
రామ కిష్టయ్య సంగన భట్ల
............ . ...........
ఎల్ఐసి ఏజెంట్ల సమస్యలను పరిష్కరించడంతోపాటు ఎల్ ఐ సి పాలసీల ప్రీమియంపై జీఎస్టీని తొలగించాలని డిమాండ్ చేస్తూ ధర్మపురి ఎల్ఐసి కార్యాలయంలో జీవిత బీమా ఏజెంట్లు సోమవారం నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా జీవిత బీమా ఏజెంట్ల యూనియన్ నాయకులు మాట్లాడుతూ పాలసీదారులకు పాలసీలపై బోనస్ రేటు పెంచాలని, జీవిత బీమా సంస్థ ఏజెంట్ల అపరిస్కృత సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎల్ఐసి ఏవో ఎస్ బి నరసయ్యకు వినతి పత్రం అందించారు.
ఈ కార్యక్రమంలో ఎల్ఐసి ఏజెంట్ల యూనియన్ నాయకులు భరతపు గుండయ్య , వొడ్డేటి భూమన్న, వేముల భాస్కర్, మల్లేశం, ఉప్పుల రామకృష్ణయ్య, రాజన్న తదితరులు పాల్గొన్నారు.
Tags:

