గంగమ్మ ఒడికు చేరిన వినాయకులు

గంగమ్మ ఒడికు చేరిన వినాయకులు

*గంగమ్మ ఒడికి చేరిన వినాయకులు*

*జగిత్యాలలో కోలాహలంగా గణేష్ నిమజ్జనం*

*తెల్లవారు జామువరకు కొనసాగిన గణపతులశోభాయాత్ర*

జిల్లా ఎస్పీ పర్యవేక్షణలో పటిష్ట పోలీసు బందోబస్తు

 

ఎన్నం కిషన్ రెడ్డి IMG-20240917-WA0057

జగిత్యాల 


జగిత్యాలలో గణపతుల నిమజ్జనం భక్తుల ఆటపాటలు, వివిధ వేషాధరణలతో "జై బోలో గణేష్ మహరాజ్ కి జై" అనే నినాదాలతో కోలాహలంగా జరిగింది.
గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మండపాల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన పిదప ఉత్తర పూజ గావించిన అనంతరం ఆనందోత్సాహాల మధ్య అందంగా అలంకరించిన వాహనాల్లో గణపతులను పెట్టి నిర్వాహకులు నిమజ్జనం చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో రెండు రోజులు నిమజ్జనం చేస్తుండగా సోమవారం ,మంగళవారం గణేష్ నిమజ్జనం చేశారు.
జగిత్యాల గణనాధులను 
చింతకుంట చెరువులో నిమజ్జనం చేయగా మున్సిపల్,రెవెన్యూ సిబ్బంది క్రేన్లను ఏర్పాటు చేయడమే కాకుండ భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఎన్ని రకాల ఏర్పాట్లు చేయగా నిమజ్జనం ప్రశాంతంగా చేశారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ నేతృత్వంలో జగిత్యాల డిఎస్పీ రఘు చందర్ పర్యవేక్షణలో జగిత్యాల పట్టణ జగిత్యాల రూరల్, ధర్మపురి, మాల్యాల సిఐ లు వేణుగోపాల్, కృష్ణారెడ్డి, రాం నర్సింహారెడ్డి, నీలం రవి లు , ఆర్ ఐ, ఎస్సైలు ,ఆర్ ఎస్సైలు, జిల్లా గార్డ్ , పోలీసులు టవర్ సర్కిల్, కొత్త బస్టాండ్ చౌరాస్తా, ఆర్డీఓ చౌరస్తా, చింత కుంట చెరువు, థిన్ కని చౌరస్తా, పాత బస్టాండ్, అన్నపూర్ణ చౌరస్తా తదితర ప్రాంతాల్లో పటిష్ట బందోబస్తు చేపట్టగా గణపతుల శోభాయాత్ర బుధవారం ఉదయం వరకు కొనసాగగా ప్రశాంతంగా ముగియడంతో ఊపిరి పీల్చుకున్నారు.జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్, జగిత్యాల ఆర్డీఓ మధుసూదన్లు, జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ అడువాల జ్యోతి, కౌన్సిలర్లు కలిసి  నిమజ్జనం ఏర్పాట్లను పర్యవేక్షించారు.
విశ్వహిందూ పరిషత్ నాయకులు టవర్ సర్కిల్ వద్ద శోభాయాత్ర వినాయకులకు కొబ్బరికాయలు కొట్టి నిర్వాహకులకు మెమోంటోలు అందించారు.
దేవిశ్రీ గార్డెన్ , బట్టివాడ, పోచమ్మవాడ, కృష్ణా నగర్, బై పాస్ రోడ్డు, విద్యానగర్ మైసమగడ్డ, వాణి నగర్, మోచి బజార్, జమ్మి గద్దే, మార్కండేయ గుడి, టవర్ సర్కిల్, పురానిపేట, భాగ్యనగర్, గోవిందుపల్లె, బీరయ్యగుడి, 
కొత్తవాడ తదితర ప్రాంతాల్లోని గణపతులను అందంగా అలంకరించిన వాహనాల్లో వినాయకులను కూర్చోబెట్టి జై గణేశా అంటూ పట్టణంలో శోభాయాత్ర నిర్వహించి చింతకుంటా చెరువులో నిమజ్జనం చేశారు.ఆయా గణపతి మండపాల  నిర్వాహకులు
నాయి బ్రాహ్మణ సంఘం జగిత్యాల జిల్లా అధ్యక్షులు పెండెం మహేందర్,కాసవేన ప్రవీణ్, కడకుంట్ల జగదీశ్వర్, జలందర్, ,చిట్ల అంజన్న, రాజశేఖర్, చిట్ల అశోక్, రియల్ ఎస్టేట్ జిల్లా యూనియన్ అధ్యక్షులు రంగు శ్రీనివాస్, ఆర్య వైశ్య సంఘం పట్టణ అధ్యక్షులు వుటూరి నవిన్, జగిత్యాల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎన్న0 కిషన్ రెడ్డి, నారాయణ,పెండెం గంగారాం,బోయినిపల్లి రమేష్, రచమల్లా శ్రీనివాస్ ,మర్రిపెళ్లి సాగర్, బండి గంగారాం, పెండెం గంగాధర్, సింగం మహేష్, బింగి గంగాధర్, తునికి రమణ, గాండ్ల మహేష్, శేఖర్, మఠం శివ కుమార్, పాలడుగు మారుతి రెడ్డి, ద స్ట్రీట్ బాయిస్ యూత్ సభ్యులు కిట్టు రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
గంగమ్మ ఒడికి చేరిన గణపతులను చివరిసారిగా కొలుస్తూ  అందరిని చల్లంగా చూడాలని మళ్ళొచ్చే ఏడాదికి అత్యంత భక్తిశ్రద్ధలతో కొలుచుకుంటామని వినాయక సెలవికా అంటూ భక్తులు వేడుకుంటూ సాగనంపారు.

Tags:

Related Posts