గోదావరిలో స్నానానికి వెళ్లి వ్యక్తి మృతి
By: Mohammad Imran
On
గోదావరిలో స్నానానికి వెళ్లి వ్యక్తి మృతి
చురకలు విలేఖరి
మల్లాపూర్, అక్టోబర్,27
గోదావరిలో స్నానానికి వెళ్లి ఈత రాకపోవడంతో వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలోని మోగిలిపేట గ్రామంలో తాపీ మెస్త్రిగా పనులు చేసుకుంటూ జీవిస్తున్న ఆంద్రప్రదేశ్ రాష్ట్రం బాపట్ల జిల్లా ఇంకొలు గ్రామానికి చెందిన వెంకటేష్ ఆదివారం సెలవు దినం కావడంతో మోగిలిపేటలోని గోదావరికి స్నానానికి వెళ్ళాడు స్నానం చేస్తున్న క్రమంలో ఎక్కువ లోతును గమనించని వెంకటేష్ ఎక్కువ ప్రవాహం ఉన్న చోటు స్నానం చేయడంతో ఈత రాకపోవడంతో గోదావరిలో పడి మృతి చెందాడు. కాగా సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.
Tags: