జర్నలిస్టు హౌసింగ్ కమిటీ సభ్యుడిగా మారుతి ప్రకాశ్

జర్నలిస్టు హౌసింగ్ కమిటీ సభ్యుడిగా మారుతి ప్రకాశ్

*పత్రికా ప్రకటన* 

*జర్నలిస్ట్ హౌసింగ్ కమిటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా మారుతి ప్రకాష్* 

చురకలు ప్రతినిధి 

కరీంనగర్, సెప్టెంబర్ 18IMG-20240918-WA0024


*తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ (టియుడబ్ల్యూజే, ఐజేయు) సంఘానికి అనుబంధ కమిటీ అయిన జర్నలిస్ట్ హౌసింగ్ కమిటీ రాష్ట్ర కమిటీ సభ్యునిగా చిగురుమామిడి మండలం రేకొండ గ్రామానికి చెందిన మారుతి ప్రకాష్ నియామకం అయ్యారు. హైదరాబాదులోని టియుడబ్ల్యూ జె ఐజెయు రాష్ట్ర యూనియన్ కార్యాలయంలో జరిగిన రాష్ట్ర విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశంలో యూనియన్ అధ్యక్షుడు కే విరహత్ అలీ మారుతి ప్రకాష్ పేరును ప్రతిపాదించగా, కార్యవర్గం ఏకగ్రీవంగా ఆమోదించింది. తన నియామకానికి సహకరించిన యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కే. విరహత్ అలీ, ఐజేయు జాతీయ కార్యవర్గ సభ్యుడు నగునూరి శేఖర్ కు ప్రకాష్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు సీనియర్ పాత్రికేయులు ప్రకాష్ కు శుభాకాంక్షలు తెలిపారు*.

Tags:

Related Posts