మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ సేవలు మరువలేనివి
మౌలానా అబుల్ కలాం ఆజాద్ సేవలు మరువలేనివి.
జగిత్యాల లో ఘనంగా జాతీయ విద్యా దినోత్సవ వేడుకలు..
చురకలు విలేకరి, జగిత్యాల, నవంబర్ 11: భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ సేవలు మరువలేనివని మౌలానా అబుల్ కలాం ఆజాద్ యూత్ అధ్యక్షులు ముజహిద్ ఆదిల్ అన్నారు. సోమవారం జగిత్యాల పట్టణంలోని తీన్ ఖని చౌరస్తా వద్ద మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్బంగా మున్సిపల్ ఆధ్వర్యంలో జాతీయ విద్యా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా నాయకులు మౌలానా అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పలువురు నాయకులు మాట్లాడుతూ భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో ఆయన చేసిన పోరాటం మరువలేనిదని, దేశ స్వాతంత్ర్యం అనంతరం దేశ మొదటి విద్యా శాఖ మంత్రిగా విశేష సేవలందించి, దేశంలో విద్యా వ్యవస్థను పటిష్టం చేయడానికి అనేక చర్యలు చేపట్టారన్నారు. దేశ మహనీయుల జయంతులు, వర్ధంతులు అధికారికంగా నిర్వహిస్తున్నప్పటికీ భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి ఉత్సవాలు నిర్వహించకపోవడం సరికాదని, రానున్న భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించాలని, జగిత్యాల పట్టణంలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సిరాజోద్దీన్ మన్సూర్, మైనార్టీ రైట్స్ ఫోరం అధ్యక్షులు మీర్ ఖాజీం అలీ, మౌలానా మజీద్, హేఫెజ్ అబ్రర్ షరీఫ్, నాయకులు అజహార్, దుమాల రాజ్ కుమార్, ముజహిద్ , అదిల్ , జుబేర్ మాలిక్, రియాజ్, సోహైల్, ఖైసార్, నాజీమ్, నేహాల్, నౌమన్, అఫ్రోజ్, నహిద్, అతఉల్లా, పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.

