విజయదశమి అందరికీ విజయాలు చేకూర్చాలి ఎస్పీ అశోక్ కుమార్

విజయదశమి అందరికీ విజయాలు చేకూర్చాలి ఎస్పీ అశోక్ కుమార్

IMG-20241012-WA0002

*విజయదశమి అందరికి విజయాలు చేకూర్చాలి :

జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్

*- - - జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయుధ, వాహన పూజలు*

 విజయదశమి పండుగ  ప్రజలకు అన్ని రంగాలలో విజయం చేకూర్చాలని  ఎస్పీ  ఆకాంక్షించారు.ఈరోజు  జిల్లా పోలీసు కార్యాలయంలోని ఆర్ముడు రిజర్వ్ విభాగంలో జిల్లా ఎస్పీ  ఆయుధ పూజ, వాహన పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా దుర్గా దేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.విజయదశమి పర్వదినోత్సవం అందరికి సుఖ సంతోషాలు కలిగించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు మరియు పోలీస్ అధికారులకు సిబ్బందికి దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.

పూజా కార్యక్రమాలలో అడిషనల్ ఎస్పీలో  భీమ్ రావ్, డిఎస్పీ లు రఘు చందర్, ఉమ మహేశ్వర రావు, రిజర్వ్ ఇన్స్పెక్టర్ లు కిరణ్ కుమార్,రామకృష్ణ, వేణు,SB ఇన్స్పెక్టర్ ఆరిఫ్ అలీ ఖాన్, రూరల్  సి.ఐ కృష్ణ రెడ్డి,RSI లు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Tags:

Related Posts