*జువ్వాడి విగ్రహానికి పూలమాలలు వేసిన ఎమ్మెల్సీ ఆమేర్ అలీ, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహర్బిన్ హంధాన్*

*జువ్వాడి విగ్రహానికి పూలమాలలు వేసిన ఎమ్మెల్సీ ఆమేర్ అలీ, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహర్బిన్ హంధాన్*

*జువ్వాడి విగ్రహానికి పూలమాలలు వేసిన ఎమ్మెల్సీ ఆమేర్ అలీ, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహర్బిన్ హంధాన్*

చురకలు ప్రతినిధి,కోరుట్ల అక్టోబర్,06,::-- కోరుట్ల పట్టణంలోని వెటర్నరీ కాలేజీ దగ్గర గల కీ"శే " మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్ రావు విగ్రహనికి పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించిన ఎమ్మెల్సీ అమిర్ అలీ ఖాన్, తెలంగాణ రాష్ట్ర ఉర్దూ అకాడమీ చేర్మెన్ తాహేర్ బిన్ హందన్. ఈ సందర్భగా ఎం ఎల్ సి అమెర్ అలీఖాన్, తెలంగాణ రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తహేర్ బిన్ హందన్ మాట్లాడుతూ జువ్వాడి సర్పంచ్‌గా సమితి అధ్యక్షుడిగా, ఎమ్మెల్యేగా , మంత్రిగా జువ్వాడి రత్నాకర్‌ రావు అందించిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. తామంతా ఆయన్ని రాజకీయాలకతీతంగా గౌరవిస్తామని అన్నారు. రాజకీయాల్లో నైతిక విలువలను పాటించిన వ్యక్తి రత్నాకర్‌రావు అని అన్నారు. రత్నాకర్ రావు సీనియర్ శాసన సభ్యులుగా, మంత్రి గా తెలంగాణకు, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ కు ఎన్నో సేవలు అందించారు అని జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం తిమ్మాపూర్ లో 1928 అక్టోబర్ 4 న రత్నాకర్ రావు జన్మించారు అని  జగిత్యాల పంచాయతీ ప్రెసిడెంట్ గా ధర్మపురి ఆలయ కమిటీ మొదటి పాలక మండలి చైర్మన్ గా బాధ్యతలు నిర్వర్తించారు. సర్పంచ్ గా 12 సంవత్సరాలు సేవలు అందించారని. ఉమ్మడి ఏపీలో బుగ్గారం నియోజకవర్గం నుంచి ఒక సారి ఇండిపెండెంట్ గా, రెండు సార్లు కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు అని వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేశారు అని తెలిపారు. ఈ ప్రాంతానికి ఇరిగేషన్ విషయంలో గాని, వైద్య సేవలు అందించడం విషయంలో గాని, పిల్లల విద్యకి సంబందించి విషయంలో చేసిన సేవలు మరువలేనివని, వారికి ఆరోగ్యం సహకరించని పరిస్థితిలో కూడా రైతుల గురించి, వారి కష్టాల గురించి ఆలోచించిన మహనీయమైన వ్యక్తి అని ఈ సందర్భంగా వారు కొనియాడారు.
మాజీ మంత్రి రత్నాకర్ రావు ప్రాంతంలో రాజకీయంగా ప్రాతినిథ్యం వహించిన ప్రాంతానికి రావడం మా అదృష్టంగా భావిస్తున్నామని, వారి అడుగుజాడల్లో మేమందరం కలిసి నడుస్తామని, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలో రత్నాకర్ రావు విగ్రహాన్ని ఏర్పాటు చేయడం సంతోషకరమని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో
కోరుట్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగ్ రావు, తెలంగాణ రాష్ట్ర సీనియర్ కాంగ్రెస్ నాయకులు  జువ్వాడి కృష్ణ రావు, టి పి సి సి రాష్ట్ర కమ్యూనికేషన్ మీడియా కోఆర్డినేటర్ మహమ్మద్ అవేస్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు తిరుమల గంగాధర్ ఉపాధ్యక్షులు నయీం, మాజీ కౌన్సిలర్ అహ్మద్ అబ్దుల్ ఖయ్యూం, సొగరా బి, సీనియర్ సియాసత్ రిపోర్టర్ సలీం ఫారుఖీ, మైనారిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.IMG-20241006-WA0008

Tags:

Related Posts