ఎమ్మెల్సీ బరిలో ముజాహిద్ హుస్సేన్
ఎమ్మెల్సి బరిలో ముజాహిద్ హుస్సెన్
చురకలు విలేఖరి
అదిలాబాద్, అక్టోబర్,04.
ప్రతిసారి ఎమ్మెల్సీ ఎన్నికలలో గెలిచిన అభ్యర్థులు ఒక్కసారి అయినా ప్రభుత్వ ఉద్యోగుల ఉపాధ్యాయుల కార్మికుల పెన్షనర్ల నిరుద్యోగుల గురించి శాసనమండలిలో ప్రశ్నించిన గొంతు లేదాని,అలాంటి గొంతు అలాంటి నాయకుడు మనకు కావాలంటే కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణానికి చెందిన మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ లాంటి నాయకుడు శాసనమండలిలో ఎమ్మెల్సీగా ఉన్నట్లయితే ప్రతి ఒక్కరి సమస్య ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్లే సత్తా ఉన్న నాయకుడు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ లాంటి నాయకునికి జరగబోయే మెదక్ కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో పోటీ లో నిలబడాలని ఉద్యోగ, విద్యార్ధి సంఘాల నుండీ ఒత్తిడి పెరుగుతుంది.
ప్రతి సమస్యను తన సమస్య అని ముందుకు వచ్చి మాట్లాడే దమ్ము ధైర్యం ప్రశ్నించే గొంతు ప్రతి ఒక్క సమస్య పత్రికల ద్వారా ప్రభుత్వం దృష్టికి ప్రతిరోజు ప్రతిసారి పత్రికలలో ఎన్నో సమస్యల మీద మాట్లాడే దమ్ము ధైర్యం ఉన్న నాయకుడు బిసి, ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం తెలంగాణ వాణిజ్య పనుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం తెలంగాణ ముస్లిం ఎంప్లాయిస్ అసోసియేషన్ మరియు వివిధ సంఘాలలో కొనసాగుతూ ఆ సంఘాలకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తూ, ఆ సంఘాలకు సంబంధించిన ప్రతి సమస్య మంత్రుల ప్రజాప్రతినిధుల రాష్ట్రస్థాయి అధికారుల జిల్లా స్థాయి అధికారుల దృష్టికి తీసుకొని వెళ్లి ఆ సమస్యల పరిష్కారం కొరకు కృషి చేస్తున్న నాయకుడే మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ అనీ వారు పేర్కొంటున్నారు.కరీంనగర్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న అన్ని నియోజకవర్గాలలో పరిచయమున్న వ్యక్తి మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ గ్రాజువేట్ నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులకు ఉపాధ్యాయులకు కార్మికులకు పెన్షనర్లకు ప్రతి ఒక్కరికి ప్రతిరోజు వినబడే పేరు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ కనుక ఇలాంటి నాయకుడే మనకు ఎమ్మెల్సీగా గెలిచినట్లయితే ప్రతి ఒక్క సమస్య శాసనమండలిలో ప్రశ్నించే గొంతుగా వినబడుతుందనీ, ఇలాంటి నాయకుడు ప్రతి ఒక్కరికి కావాల్సిన అవసరం ఉందనీ,కోట్లకు కోట్లు ఉన్న వ్యక్తి వివిధ రకాల వ్యాపారాలు చేసే వ్యక్తి ఎమ్మెల్సీగా గెలిచినట్లయితే ఆ వ్యక్తి ఎప్పుడు సమయం తీస్తాడు ఎవరైనా ఏదైనా సమస్య అతని దృష్టికి తీసుకొని వెళ్తామని అక్కడికి వెళ్ళినట్లయితే అతను సమయము కేటాయించే పరిస్థితుల్లో ఉండడు డబ్బులు ఉన్న వ్యక్తి వ్యాపారం ఉన్న వ్యక్తి
పట్టభద్రులకు,
నిరుద్యోగులకు ,ఉపాధ్యాయులకు ప్రభుత్వ ఉద్యోగులకు, కార్మికులకు సమయము ఎక్కడ ఇస్తారనీ వారు పేర్కొంటున్నారు. ఎటువంటి వ్యాపారము గాని ఎటువంటి సంస్థలు గాని లేని వ్యక్తికి ఎమ్మెల్సీగా గెలిపించుకున్నట్లయితే ఆ వ్యక్తి ప్రతి ఒక్కరికి సమయము ఇవ్వడానికి అందుబాటులో ఉంటాడనీ ,అలాంటి వ్యక్తిని కరీంనగర్ ,మెదక్ ,నిజామాబాద్
ఆదిలాబాద్ జిల్లాలకు ఎమ్మెల్సీగా గెలిపించుకొంటే
బాగుంటుందని వివిధ సంఘాల నాయకులు పేర్కొంటున్నారు .రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికలలో కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణానికి చెందిన మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికలలో అందరు కలిసి మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ కు జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేయడానికి సిద్ధంగా ఉండాలని వివిధ సంస్థల నాయకులు, జి వీరస్వామి, కే రవీందర్ ,బి మహేందర్, ఎస్కే సాబీర్ ,మహమ్మద్ అల్లావుద్దీన్ ,సత్యనారాయణ గౌడ్ ,ఎల్లయ్య గౌడ్, విక్టర్ డేవిడ్ ,ఇన్ ఆర్పిఎల్ సాంబయ్య ,మహమ్మద్ జావిద్ అలీ ,ఖాజా అల్తాఫ్ హుస్సేన్ తదితరులం పేర్కొన్నారు.
కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ జిల్లాలలో ఉన్న అన్ని మండలాలలో ప్రచారం చేయడానికి నిర్ణయించుకున్నామని వారు తెలిపారు, నిరుపేద ప్రతి ఒక్కరి సమస్య తన సమస్యని ముందుకు వచ్చి పనిచేసే వ్యక్తి ఇప్పటి సమయంలో అవసరం ఉందని వారు ఈ సందర్భంగా అన్నారు .కోట్ల డబ్బులు పెట్టుకొని వచ్చి నిరుద్యోగులకు ఆశలు చూపెట్టి నిరాశ చేసేలాంటి వ్యక్తులు ఇప్పటి పరిస్థితులలో అవసరం లేదని వారందరూ ఈ సందర్భంగా ఒక తీర్మానం చేసినట్లు చెప్పారు.

