కరీంనగర్ జిల్లా కోర్టును సందర్శించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి

కరీంనగర్ జిల్లా కోర్టును సందర్శించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి

కరీంనగర్ జిల్లా కోర్టును సందర్శించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ  అభ్యర్థి     వి.నరేందర్ రెడ్డి


చురకలు ప్రతినిధి 
కరీంనగర్, సెప్టెంబర్,18

న్యాయవాద వృత్తి చాలా విలువైనదని మరియు ప్రముఖమైనదని కరీంనగర్ నిజామాబాద్ - ఆదిలాబాద్ - మెదక్ పట్టభద్రుల నియోజక వర్గ ఎమ్మెల్సీ అభ్యర్థి అల్ఫోర్స్ డా॥వి. నరేందర్ రెడ్డి  కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కోర్టును సందర్శించి న్యాయవాదులను కలిసి వారి అభ్యర్థిత్వాన్ని బలపర్చాలని మరియు మొదటి ప్రాధాన్యత ఓటు తనకే వేయాలని కోరారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యావేత్తనైన తనకు రాబోయే యం.యల్.సి ఎన్నికల్లో తనకు అవకాశం ఇవ్వాలని మరియు అత్యధిక మెజారిటితో గెలిపించాలని న్యాయవాదులను అభర్థించారు. తను యం.యల్.సి గా గెలిచినట్లైతే ప్రస్తుతం ఉన్న వ్యక్తిగత భీమా 2,00,000/- నుండి 10,00,000/- వరకు పెంచే ప్రయత్నం చేస్తానని, న్యాయవాదులకు వారి కార్యకలాపాలను కొనసాగించడానికై మరియు వివిధ కార్యక్రమాలను చేపట్టడానికై ప్రత్యేక భవనాన్ని నిర్మిస్తానని, మహిళా న్యాయవాదులకు ప్రత్యేక భవనాన్ని నిర్మిస్తామని ముఖ్యంగా నూతనంగా వృత్తిలో అడుగుపెట్టిన వారికి ప్రభుత్వం వారి నుండి నెలకు రూ॥5,000/- లు స్టైఫండ్ రూంపంలో ఇచ్చేటట్లుగా ఒత్తిడి తెస్తానని హామి ఇచ్చారు. న్యాయవాదులకు సమస్యలు ఉన్నట్లైతే వారి సమస్యలను వినిపించడానికై గళం విప్పడానికై తాను ఎల్లప్పుడు ముందుంటానని ప్రకటించారు. విద్యారంగ అభివృద్ధికి కృషి చేసినట్లుగానే న్యాయవాదుల సంక్షేమానికి కట్టుబడి ఉంటానని హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర విద్యారంగంలో అనేక సంచలన విజయాలను నమోదు చేస్తూ ఐకాన్ గా నిలుస్తున్న నరేందర్ రెడ్డి నీ వారందరు ఘనంగా సత్కరించారు.

ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బేతి మహేందర్ రెడ్డి, కార్యదర్శి భీమాసాహెబ్, వంశీ, పలువురు న్యాయవాదులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.IMG-20240918-WA0014

Tags:

Related Posts