కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి రేవంత్ రెడ్డిది కీలక పాత్ర ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి రేవంత్ రెడ్డిది కీలక పాత్ర ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

*కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి రేవంత్ రెడ్డిది కీలక పాత్ర*

*మూసి ప్రక్షాళనతో కాంగ్రెస్ వైభవం ఇనుమడిస్తుంది..*

 *సీఎం  జన్మదిన వేడుకల్లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి*

జగిత్యాల ప్రతినిధి ;

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రస్తుతముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక పాత్ర పోషించారని మాజీమంత్రి ,పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి అన్నారు.

 ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి జ్జన్మదిన వేడుకలను శుక్రవారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటి పర్థి జీవన్  రెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ  నాయకులు, కార్యకర్తల తో కలిసి జీవన్ రెడ్డి కేక్ కట్ చేశారు. 

ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ 
అంచెలంచెలుగా ఎదిగిన రేవంత్ రెడ్డి ప్రజా జీవితం యువతకు ఆదర్శమన్నారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ, ప్రభుత్వం ముందుకు సాగుతు0దన్నారు.

ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు  స్వయం ఉపాధి కల్పన కోసం నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామని తెలిపారు.

ప్రజల జీవన విధానం, కుల గణన  చేపట్టి దేశానికి తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు.
 రాజ్యాంగం కల్పించిన వారి హక్కుల కోసం కుల గణన చేపట్టామని జీవన్ రెడ్డి పేర్కొన్నారు.
మూసి నది ప్రక్షాళన ఆవశ్యకతను తెలిపేందుకు రేవంత్ రెడ్డి పాదయాత్ర చేపట్టారని జీవన్ రెడ్డి స్పష్టంచేశారు.
అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్ ను తీర్చిదిద్దేందుకు సీఎం ముసి ప్రక్షాళన చేపట్టారని,
ముసి ప్రాజెక్టు ప్రక్షాళన తో 
మురికి నీరు శుద్ధిచేసి నల్గొండకు సాగునీరు అందిస్తామన్నారు.

ఏ పార్టీ కూడా ముసి ప్రాజెక్ట్ ప్రక్షాళన ను వ్యతిరేకించడం లేదని నిర్వాసితులకు పునారావాసం కల్పించాలని అంటున్నారని చెబుతూ
ముసి నిర్వాసితులకు ఆదుకోవడం ప్రభుత్వ బాధ్యతగా తీసుకుని వారికి ఉపాధి కల్పించడంతో పాటు పునరావాసం  కల్పిస్తామన్నారు.

ముసి ప్రక్షాళన తో కాంగ్రెస్  పార్టీ వైభవం 
ఇనుమడిస్తుందని తెలిపారు.
 ప్రతిపక్ష పార్టీ నాయకులు ముసి ప్రాజెక్ట్ పై ప్రజల్లో అపోహలు కల్పించే ప్రయత్నం చేస్తున్నారని జీవన్ రెడ్డి విమర్శించారు.

నాలుగు దశాబ్దాలుగా తన వెన్నంటి ఉంటున్న నాయకులు, కార్యకర్తలకు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డీ కృతజ్ఞతలు తెలిపారు.
 కార్యక్రమంలో మాజి మున్సిపల్ చైర్మన్లు విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి, జి ఆర్ దేశాయ్, కౌన్సిలర్లు దుర్గయ్య, నక్క జీవన్,హనుమల్ల జయశ్రీ, నాయకులు బండ శంకర్, 
రాంచంద్రారెడ్డి, మన్సూర్ అలీ, అబ్బిడి లక్ష్మారెడ్డి,మల్లారెడ్డి, భారీ, మహేష్, రఘువీర్ గౌడ్, బీరం రాజేష్, ఎన్న0 మధుకర్ రెడ్డి,శ్రీనివాస్, రాజేందర్, పిప్పరి అనిత, చిట్ల లత,తదితరులు పాల్గొన్నారు.IMG-20241108-WA0001

Tags:

Related Posts