వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళన ముజాహిద్
వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించకుంటే ఆందోళన చేపడతాం
ముజాహిద్ హుస్సేన్
చురకలు విలేఖరి
హుజూరాబాద్,అక్టోబర్,21
రాష్ట్ర వాణిజ్య పనుల శాఖలో పని చేస్తున్న జూనియర్ అసిస్టెంట్ సీనియర్ అసిస్టెంట్ ఎ సి టి ఓ లకు సంబంధించిన సమస్యలు ఎక్కడి గొంగళి వేసిన అక్కడనే పడి ఉన్నట్టు పరిస్థితి వాణిజ్య పనుల శాఖలో కొనసాగుతుందని తెలంగాణ వాణిజ్య పనులు శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ అన్నారు. ఆయన మాట్లాడుతూ వాణిజ్య పనుల శాఖలో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్ నుండి మరియు సీనియర్ అసిస్టెంట్ వరకు ఆరు సంవత్సరాల నుండి బదిలీలు లేక ఉద్యోగులు ఇబ్బందుల పాలు అవుతున్నారు చాలామంది 317 జీవో వల్ల ఎంతో మంది ఉద్యోగులు మానసికంగా కుమిలిపోతున్నారు దాదాపు 8 సంవత్సరాల క్రితం 2017 సంవత్సరంలో వాణిజ్య పనుల శాఖలో పనిచేస్తున్న ఏ సి టి ఓ లకు గజిటెడ్ హోదా కల్పించాలని అప్పుడు నుండి ఇప్పటివరకు టిసిటిఎన్జీవోస్ సంఘం పక్షాన ఎన్నో రిప్రజెంటేషన్లు ఇచ్చినప్పటికీ సమస్య పరిష్కారం కాకుండా అలాగనే పెండింగ్లో ఉంది ఆంధ్రప్రదేశ్లో ఏ సి టి ఓ గెజిటెడ్ హోదా అమలై నాలుగు సంవత్సరాలు అవుతుందన్నారు .జీవో ఎంఎస్ 212 ద్వారా ఆంధ్రప్రదేశ్ లో పనిచేస్తున్న ఏసీటీ గజిటెడ్ హోదా అమలైంది వారి కంటే ముందు తెలంగాణ రాష్ట్రంలో వాణిజ్య పనుల శాఖలో పనిచేస్తున్న ఏసీటీవో లకు గజిటెడ్ హోదా కల్పించాలని 2017 సంవత్సరంలో తెలంగాణ వాణిజ్య పనుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ ఆధ్వర్యంలో సంఘం పక్షాన రిప్రజెంటేషన్ ఇవ్వటం జరిగిందన్నారు .అప్పటినుండి ఇప్పటివరకు ఏ సి టి ఓ గజిటెడ్ హోదా రాకపోవడం వలన ఈ వాణిజ్య పనుల శాఖలో పనిచేస్తున్న ఏసీటీవోలు మానసికంగా కుమిలిపోతున్నారు తెలంగాణ రాష్ట్రంలో ఏ సి టి ఓ లకు గెజిటెడ్ హోదా ఇవ్వాలని మొట్టమొదటి తెలంగాణ రాష్ట్రంలో పిఆర్సి కమిషన్ రికమండేషన్ చేసిందన్నారు .తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శి ఏ సి టి ఓ లకు గ్రూప్ టు కింద వస్తారు కనుక గ్రూప్ లో ఉన్న అధికారులందరూ ఆయా శాఖలో గజిటెడ్ హోదాలో కొనసాగుతున్నారనీ ,వాణిజ్య పన్నుల శాఖలో పనిచేస్తున్న ఏసీటీవో లకు కూడా గజిటెడ్ హోదా వెంటనే కల్పించండి అని లేఖ రాయడం జరిగిందన్నారు . రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ కూడా వాణిజ్య పనుల శాఖలో పనిచేస్తున్న ఎ సి టి ఓ లకు గజిటెడ్ హోదా కల్పించిన మాత్రాన ప్రభుత్వ ఖజానాపై ఎటువంటి భారం పడదని తెలియజేశారు జే ఏ డి కూడా వాణిజ్య పనుల శాఖలో పనిచేస్తున్న ఏ సి టి ఓ లకు గజిటెడ్ హోదా ఇవ్వచ్చని సిఫార్సు చేయటం జరిగిందన్నారు.తదుపరి రాష్ట్రంలో 2వ పిఆర్సి కమిషన్కు లేఖ రాయగా కమిషన్ సమాధానం ఇస్తూ గతంలోనే మొదటి పి ఆర్ సి ఫార్సు చేసిందన్నారు. వెంటనే దీనిని అమలు చేయాలని రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ మరియు ఎక్సైజ్ శాఖ ప్రిన్సిపాల్ సెక్రెటరీ లేఖ ద్వారా తెలియజేయడం జరిగిందన్నారు. ప్రస్తుతం ఉన్న రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మరియు వాణిజ్య పనుల శాఖ రెవిన్యూ ప్రిన్సిపాల్ సెక్రటరీ రజ్వి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక శాఖ ప్రిన్సిపాల్ సెక్రెటరీ ఫైల్ పంపించగా అక్కడి నుండి రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ శాంత కుమారి వద్ద ఫైల్ పెండింగ్లో ఉందన్నారు.వెంటనే వాణిజ్య పనుల శాఖలో పనిచేయుచున్న 500 పైగా ఎ సి టి ఓ లకు గెజిటెడ్ హోదా వెంటనే కల్పించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ,మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క ,కొండ సురేఖ తోపాటు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, హైదరాబాద్ పార్లమెంట్ సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ తో పాటు మజ్లిస్ పార్టీ శాసనసభ్యులు ఆరుగురు, ఎమ్మెల్సీ లిద్దరు, బిజెపి పార్టీ శాసనసభ్యులు అయిదుగురు ,కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు 14 మంది ,సీపీఐ శాసన పక్ష నాయకుడు, బి ఆర్ ఎస్ పార్టీ శాసనసభ్యులు ,ముగ్గురు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖలు రాయటం జరిగిందన్నారు.అయినప్పటికీ ఇప్పటివరకు వాణిజ్య పన్నుల శాఖలో పనిచేస్తున్న ఎ సి టి ఓ లకు గజిటెడ్ హోదా రాకపోవడం చాలా బాధాకరమైన విషయం అన్నారు .ఇదే విషయంపై శాసనసభలో మజిలీస్ పార్టీ శాసన పక్ష నాయకుడు అక్బరుద్దీన్ ఓవైసీ మూడుసార్లు శాసనసభలో ఏ సి టి ఓ లకు గజిటెడ్ హోదా ఇచ్చినచో రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక శాఖపై ఒక్క పైసా భారం కూడా పడదని అయిన ప్రభుత్వం దృష్టికి తీసుకొని వచ్చిరన్నారు .అయినప్పటికీ ఇప్పటివరకు సమస్య పరిష్కారం కాకపోవటం వలన వాణిజ్య పన్నుల శాఖలో పనిచేస్తున్న ఏ సి టి ఓ లు ఆందోళన కార్యక్రమం చేపట్టడానికి నల్ల బ్యాడ్జుల నిరసన ,మధ్యాహ్నం లంచ్ సమయములో జాయింట్ కమిషనర్ కార్యాలయాల ఎదుట నిరసన తెలియజేయడం, ఏ సి టి ఓ లకు వెంటనే గజిటెడ్ హోదా ప్రభుత్వం కల్పించాలని నినాదాలు చేయడం ,అప్పటివరకు సమస్య పరిష్కారం రాకుంటే ఒకరోజు రిలే నిరాహార దీక్ష , రాష్ట్రం అంతట చేపట్టడానికి వెనుకడుగు వేసేది లేదని తెలంగాణ వాణిజ్య పన్ను ల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ఇదే వాణిజ్య పనుల శాఖలో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్ నుండి సీనియర్ అసిస్టెంట్ మరియు సీనియర్ అసిస్టెంట్లకు ఏ సి టి ఓ ప్రమోషన్లు బదిలీలు చేపట్టాలని వాణిజ్య పనుల శాఖలో కమీషనర్లకు వాణిజ్య పన్నుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం పక్షాన లెక్కలేని రిప్రజెంటేషన్లు ఇవ్వటం జరిగిందనీ,అయినప్పటికీ ఇప్పటివరకు కమిషనర్ కార్యాలయంలో క్రింది స్థాయి జూనియర్ అసిస్టెంట్ సీనియర్ అసిస్టెంట్ ఏ సిటీ ఓ లకు సంబంధించిన సమస్యలు పరిష్కారం కాకపోవటం వలన ఈ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులందరూ మానసికంగా కుమిలిపోతున్నారన్నారు. రాష్ట్ర వాణిజ్య పనుల శాఖ కమిషనర్ మరియు తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ మరియు వాణిజ్య పన్నుల శాఖ రెవెన్యూ ప్రిన్సిపాల్ సెక్రటరీ రజ్వి నీ కలిసి టిసిటిఎన్జీవోస్ సంఘం పక్షాన రిప్రజెంటేషన్లు కూడా ఇవ్వటం జరిగిందన్నారు. అయినప్పటికీ కదలిక రాకపోవటంతో రాష్ట్ర మంత్రి డి శ్రీధర్ బాబు దృష్టికి తీసుకొని వెళ్లి ఆయన ద్వారా రెవిన్యూ ప్రిన్సిపాల్ సెక్రటరీ రజ్వి కి ఫోన్ ద్వారా చెప్పించటం జరిగిందన్నారు.అయినప్పటికీ ఇప్పటివరకు వాణిజ్య పనుల శాఖ లో పనిచేస్తున్న పై స్థాయి అధికారులకు ప్రమోషన్లు బదిలీలు చేపట్టినారు కానీ క్రింది స్థాయి ఎన్జీవోస్ కు సంబంధించిన జూనియర్ అసిస్టెంట్ నుండి సీనియర్ అసిస్టెంట్ నుండి ఏ సి టి ఓ ప్రమోషన్లు బదిలీలు ఇప్పటివరకు చేపట్టకపోవడం చాలా బాధాకరమైన విషయం అని తెలంగాణ వాణిజ్య పనుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ అన్నారు.

