నిరుద్యోగ సమస్యలపై నిరంతరం పోరాడుతా నరేందర్ రెడ్డి
- *నిరుద్యోగ సమస్యలపై నిరంతరం పోరాడుతా*
- *వివిధ శాఖలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి కృషి చేస్తా..*
*ప్రతి ఒక్కరూ తప్పకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలి*
- మెట్ పల్లి పట్టణంలో ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్ఫోర్స్ డాక్టర్ వి నరేందర్ రెడ్డి విస్తృత ప్రచారం..

మెట్ పల్లి, అక్టోబర్ 16
- *ప్రభుత్వ హై స్కూల్, జూనియర్, డిగ్రీ , కళాశాలలతో పాటు బార్ అసోసియేషన్ ప్రతినిధులను కలిసి రానున్న ఎన్నికల్లో మద్దతు కోరారు*
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగుల కు బాసటగా నిలిచేందుకే రానున్న పట్టభద్రులు ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు కరీంనగర్ , అదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల ఎన్నికల్లో ఎమ్మెల్సీ గా పోటీ చేస్తున్నట్లు ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి పేర్కొన్నారు... బుధవారం పట్టణంలో విస్తృతంగా పర్యటించి పలు ప్రైవేటు ప్రభుత్వ కళాశాల బృందంతో సమావేశం నిర్వహించి తనకు మద్దతు పలకాలని కోరారు .. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఎమ్మెల్సీగా గెలిచిన నాయకులు పట్టభద్రుల సమస్యలను విస్మరించి పూర్తిగా రాజకీయాలకే సమయం కేటాయించారని అన్నారు... రానున్న పట్టభద్రుల ఎన్నికల్లో తనను గెలిపిస్తే ఉద్యోగ నిరుద్యోగ సమస్యలపై మండలిలో గలమెత్తుతానని అన్నారు... విద్యారంగ సమస్యలపై తనకు పూర్తిస్థాయిలో అవగాహన ఉందని వెల్లడించారు.. ప్రతి ఒక్క పట్టభద్రుడు నవంబర్ 6 లోపు తమ ఓటును నమోదు చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేవలం 1లక్ష 97 వేలు మాత్రమే ఓటును నమోదు చేసుజకున్నారని కేవలం 1లక్ష 7 వేలు మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలిపారు.. ఈసారి ఎక్కువ మొత్తంలో సభ్యత్వ నమోదు చేపట్టాలని ఉమ్మడి నాలుగు జిల్లాల వ్యాప్తంగా పర్యటిస్తూ ఓటు నమోదు పై అవగాహన కల్పిస్తున్నట్లు వెల్లడించారు..ప్రతి ఒక్కరూ తప్పకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు..పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రాడ్యుయేషన్ పూర్తయిన వారు తప్పకుండా ఓటు హక్కు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తానని తెలిపారు...నవంబరు 06 వరకు ఆన్ లైన్ లో ధరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. 2021 కి ముందు గ్రాడ్యుయేషన్ పూర్తయిన వారు అర్హులు అని అన్నారు.

