పట్టభద్రులకు బాసటగా నిలిచేందుకే రాజకీయాల్లోకి నరేందర్ రెడ్డి

పట్టభద్రులకు బాసటగా నిలిచేందుకే రాజకీయాల్లోకి నరేందర్ రెడ్డి

-  *పట్టభద్రుకు బాసటగా నిలిచేందుకే రాజకీయాల్లోకి...*

-  *నిరుద్యోగ సమస్యలపై నిరంతరం పోరాడుతా*

-  *వివిధ  శాఖలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి కృషి చేస్తా..*

 -  *గజ్వేల్  పట్టణంలో ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్ఫోర్స్ డాక్టర్ వి నరేందర్ రెడ్డి విస్తృత ప్రచారం..*

చురకలు ప్రతినిధి కరీంనగర్ అక్టోబర్ 1

-   *ప్రభుత్వ హై స్కూల్, జూనియర్, డిగ్రీ ,పాలిటెక్నిక్ , కళాశాలలతో పాటు బార్ అసోసియేషన్ ప్రతినిధులను కలిసి రానున్న ఎన్నికల్లో మద్దతు కోరారు*

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగుల కు బాసటగా నిలిచేందుకే రానున్న పట్టభద్రులు ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు కరీంనగర్ , అదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల ఎన్నికల్లో ఎమ్మెల్సీ గా పోటీ చేస్తున్నట్లు ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి పేర్కొన్నారు... మంగళవారం గజ్వేల్ పట్టణంలో విస్తృతంగా పర్యటించి పలు ప్రైవేటు ప్రభుత్వ కళాశాల బృందంతో సమావేశం నిర్వహించి తనకు మద్దతు పలకాలని కోరారు అనంతరం మీడియా తో మాట్లాడారు... ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఎమ్మెల్సీగా గెలిచిన నాయకులు పట్టభద్రుల సమస్యలను విస్మరించి పూర్తిగా రాజకీయాలకే సమయం కేటాయించారని అన్నారు... రానున్న పట్టభద్రుల ఎన్నికల్లో తనను గెలిపిస్తే ఉద్యోగ నిరుద్యోగ సమస్యలపై మండలిలో గలమెత్తుతానని అన్నారు... విద్యారంగ సమస్యలపై తనకు పూర్తిస్థాయిలో అవగాహన ఉందని వెల్లడించారు.. ప్రతి ఒక్క పట్టభద్రుడు నవంబర్ 6 లోపు తమ ఓటును నమోదు చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేవలం  1లక్ష 97 వేలు మాత్రమే ఓటును నమోదు చేసుజకున్నారని కేవలం 1లక్ష 7 వేలు మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలిపారు.. ఈసారి ఎక్కువ మొత్తంలో సభ్యత్వ నమోదు చేపట్టాలని ఉమ్మడి నాలుగు జిల్లాల వ్యాప్తంగా పర్యటిస్తూ ఓటు నమోదు పై అవగాహన కల్పిస్తున్నట్లు వెల్లడించారు.. గజ్వేల్ పట్టణంలో డాక్టర్స్ ని అడ్వకేట్స్ ని ఉద్యోగులను నిరుద్యోగులను పట్టబద్ధులను సుమారు 2000 మందిని కలిసి ఓటు సభ్యత్వ నమోదుపై అవగాహన కల్పించినట్లు  వెల్లడించారు...IMG-20241001-WA0010

Tags:

Related Posts