ఉత్తర తెలంగాణ కేంద్రంగా భవిష్యత్తులో పెద్ద స్టేడియం నిర్మాణానికి కృషి వూట్కూరి నరేందర్ రెడ్డి

ఉత్తర తెలంగాణ కేంద్రంగా భవిష్యత్తులో పెద్ద స్టేడియం నిర్మాణానికి కృషి   వూట్కూరి నరేందర్ రెడ్డి

ఉత్తర తెలంగాణ కేంద్రంగా భవిష్యత్తులో పెద్ద స్టేడియం నిర్మాణానికి కృషి

ఎమ్మెల్సీ అభ్యర్థి వూట్కూరి నరేందర్ రెడ్డి

చురకలు ప్రతినిధి 
కరీంనగర్,అక్టోబర్,20

తెలంగాణ రాష్ట్రంలో క్రీడా రంగానికి .అధిక ప్రాధాన్యత ఇస్తానని  కరీంనగర్ అదిలాబాద్ నిజాంబాద్ మెదక్  పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అల్ఫోర్స్ డా. వి నరేందర్ రెడ్డి  పేర్కొన్నారు... ఆదివారం కరీంనగర్ జిల్లా కేంద్రం లో ని ఓ సమావేశ మందిరం లో వ్యాయామ ఉపాధ్యాయుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది... ఈ సందర్భంగా పీఈటీల నుండి పీడీలుగా  పదోన్నతులు పొందిన జిల్లా వ్యాయామ ఉపాధ్యాయులను  శాలువాతో ఘనంగా సన్మానించారు  ..ఈ సందర్బంగా  ఆయన మాట్లాడుతు రానున్న పట్టభద్రుల ఎన్నికల్లో తనను భారీ మెజారిటీ తో గెలిపిస్తే  ఉత్తర  తెలంగాణ కేంద్రంగా    అతిపెద్ద స్టేడియం నిర్మాణానికి  కృషి చేస్తానని వ్యాయామ ఉపాధ్యాయులకు హామీ ఇచ్చారు.. చాలా చోట్ల  ప్రభుత్వ పాఠశాలల్లో క్రీడా మైదానాలు ప్రహరీ గోడలు లేక అన్యక్రాంత మవుతున్నాయని... వాటన్నిటికీ ప్రహరీ గోడలు నిర్మించేందుకు కృషి చేస్తానన్నారు.. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో  జిల్లా క్రీడా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడా పోటీలకు ఎక్కువ మొత్తంలో సహాయ సహకారాలు అందించానని... క్రీడా రంగానికి అధిక ప్రాధాన్యత నిస్తూ  గ్రామీణ ప్రాంతంలో ఉన్న మెరికల్లాంటి క్రీడాకారులకు ప్రోత్సాహాలు అందజేస్తూ ఉత్తమ క్రీడాకారులను వెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నానని అన్నారు..  .. జాతీయస్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు ప్రోత్సాహకాలు అందించిన విషయాన్ని గుర్తు చేశారు.. రాష్ట్రవ్యాప్తంగా  ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించేందుకు చట్టసభల్లో పోరాడుతానని అన్నారుIMG-20241020-WA0006

Tags:

Related Posts