తమ మద్దతుదారులు ఎన్రోల్మెంట్ కు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి నరేందర్ రెడ్డి
తమ మద్దదారులు ఎన్ రోల్ మెంట్ కు అధిక ప్రాధాన్యత నివ్వాలి
అర్హులకు ఎన్రోల్మెంట్ పత్రాలు అందజేసిన అధినేత నరేందర్ రెడ్డి
ఎమ్మెల్సీ పోటీదారు ఆల్ఫోర్స్ అధినేత నరేందర్ రెడ్డి
సుల్తానాబాద్ సెప్టెంబర్ 16 ..తన మద్దతుదారులు ప్రతి పట్టభద్రుని ఎన్రోల్మెంట్కు అధిక ప్రాధాన్యత నివ్వాలని ఎమ్మెల్సీ పోటీదారు ఆల్ఫోర్స్ అధినేత నరేందర్ రెడ్డి అన్నారు. సోమవారం సుల్తానాబాద్ ఆల్ఫోర్స్ పాఠశాల యందు అర్హులైన పట్టభద్రులకు ఎన్రోల్మెంట్ పత్రాలను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చినట్లే పట్టభద్రులు, యువత విషయంలో అధిక ప్రాధాన్యత నివ్వడంలో శ్రద్ధ వహిస్తామన్నారు. త్వరలో జరగబోయే కరీంనగర్ , నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే నాకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ప్రభుత్వం తరఫున నిరుద్యోగులకు అండగా నిలిచి జాబ్ క్యాలెండర్ కోసం కృషి చేస్తానన్నారు. యువత, నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామన్నారు.ఎన్రోల్మెంట్ పై అవగాహన లేక గత ఎన్నికల్లో చాలామంది పట్టబద్దులు ఎన్రోల్మెంట్ చేసుకోలేదన్నారు అందుకే ప్రతి ప్రాంతంలో అవగాహన సమావేశాలు ఏర్పాటు చేసి ఎన్రోల్మెంటుకు పాల్గొన్నారు.

