వేములవాడ రాజన్న ను దర్శించుకున్న నరేందర్ రెడ్డి
By: Mohammad Imran
On
*వేములవాడ రాజన్న ను దర్శించుకున్న నరేందర్ రెడ్డి*
వేములవాడ
రాజరాజేశ్వర స్వామిని పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అల్ఫోర్స్ డాక్టర్ వి నరేందర్ రెడ్డి మంగళవారం దర్శించుకున్నారు. అనంతరం రాజరాజేశ్వర స్వామి వారికి కోడె మొక్కు చెల్లించుకున్నారు. ఆలయ కల్యాణ మండపంలో అర్చకులు ఆశీర్వచనం, రాజన్న ప్రసా దాన్ని అందజేశారు. వేములవాడకు విచ్చేసిన నరేందర్ రెడ్డి కి ఆలయ ఉద్యోగులు, అర్చకులు స్థానిక యువకులు శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు..అనంతరం డా. బీఆర్ అంబెడ్కర్ ,తెలంగాణ తల్లికి నివాళులు అర్పించి పాత్రికేయుల సమావేశం నిర్వహించారు
Tags:

