న్యాయవాదుల రక్షణ చట్టం అమలుకు కృషి నరేందర్ రెడ్డి

న్యాయవాదుల రక్షణ చట్టం అమలుకు కృషి నరేందర్ రెడ్డి

-  *న్యాయవాదుల రక్షణ చట్టం అమలుకు కృషి* 

  •   పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ వి నరేందర్ రెడ్డి
  •  
  • చురకలు విలేఖరి 
  • రాజన్న సిరిసిల్ల, అక్టోబర్,08IMG-20241008-WA0001

తెలంగాణ న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని  పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అల్ఫోర్స్  డాక్టర్ వి నరేందర్ రెడ్డి పేర్కొన్నారు.. మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ, సిరిసిల్ల బార్ అసోసియేషన్ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.. ఓటరు నమోదు పై వారికీ పలు సూచనలు చేశారు.. ప్రతి ఒక్కరూ పట్టభద్రుల ఓటు నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు.. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాలని  కోరారు

 ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయవాదుల ప్రధాన డిమాండ్ అయిన అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలుకు తన వంతు కృషి చేస్తానని.. ఈ అంశము ఇప్పటికే ప్రభుత్వం దృష్టిలో ఉందని..ప్రతిపాదిత చట్టం త్వరలో వాస్తవరూపం దాల్చుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు.. అదే విధంగా యువ న్యాయవాదులకు  5వేల రూ గౌరవ వేతనం ఇచ్చే విధంగా  ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని అన్నారు..  చాలా చోట్ల కోర్టులు అద్దె భవనాల్లో కొనసాగుతుందని కనీస మౌలిక సదుపాయాలు లేక న్యాయవాదులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని  పక్క భవనం కోసం తాను కృషి చేస్తానని హామీ ఇచ్చారు

Tags:

Related Posts