ఫారెస్ట్ ఆఫీస్ ఆవరణలో అధికారుల లిక్కర్ దావత్
ఫారెస్ట్ ఆఫీస్ ఆవరణలో అధికారుల లిక్కర్ దావత్..
దావత్ కు హాజరైన జిల్లా అటవీశాఖ సెక్షన్, బీట్ అధికారులు, సిబ్బంది..
వీడియో తీస్తున్న ఇద్దరు పాత్రికేయులపై అటవీశాఖ సిబ్బంది దురుసు ప్రవర్తన.
పాత్రికేయుని చేయి పట్టుకున్నా సిబ్బంది...!
ఈ విషయమై ఉన్నతాధికారులను ప్రశ్నించగా విచారణ చేసి చర్యలు తీసుకుంటాం.
చురకలు ప్రతినిధి, జగిత్యాల, అక్టోబర్ 11 : జగిత్యాల కేంద్రంలోని ఫారెస్ట్ ఆఫీస్ బార్ అండ్ రెస్టారెంట్ ను
తలపించింది. కొందరు ఫారెస్ట్ అధికారులు మద్యం సేవించి జల్సా చేశారు. దసరా సందర్భంగా మైసమ్మకు యాటను కోసి అటవీశాఖ చెందిన కొందరు అధికారులు ఎంచక్కా శుక్రవారం దావత్ చేసుకున్నారు. దావత్ చేసుకోవడంలో అభ్యంతరం ఏమీ లేనప్పటికీ.. జగిత్యాల జిల్లా ఫారెస్ట్ ఆఫీస్ కార్యాలయం ఆవరణలో మద్యం సేవించడం వివాదాస్పదంగా మారింది. అయితే, కొందరు టింబర్ సామిల్ డిపోల నిర్వాహకులు మందు దావత్ కు స్పాన్సర్షిప్ చేసినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం నుండి ఫారెస్ట్ ఆఫీస్ ఆవరణలో కొందరు సామిల్ నిర్వాహకులతో పాటు మరి కొందరు ఫారెస్ట్ ఆఫీసర్లు మద్యం తాగుతున్నట్లుగా స్థానికులు తెలిపారు. విషయం మీడియా చెవిన పడడంతో కవరేజ్ కోసం వెళ్ళిన రిపోర్టర్లను చూసి సామిల్ టింబర్ డిపోల యజమానులతో పాటు కొందరు ఫారెస్ట్ సిబ్బంది అక్కడ నుండి జారుకున్నారు. ఇదేంటని ప్రశ్నించిన మీడియాపై అక్కడే ఉన్న కొందరు ఫారెస్ట్ ఆఫీసర్లు దురుసుగా ప్రవర్తించారు. ఈ ఘటనపై జిల్లా ఫారెస్ట్ అధికారి రవి ప్రసాద్ ను వివరణ కోరగా ఈ విషయం తనకు తెలియదని ఘటనపై దర్యాప్తు చేసి బాధ్యులపై శాఖపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
పాత్రికేయులతో అటవీ శాఖ సిబ్బంది దురుసు ప్రవర్తన..
జగిత్యాల ఫారెస్ట్ అధికారి కార్యాలయంలో ఆవవరణలో అటవీ శాఖ సిబ్బంది దావత్ చేసుకుంటున్నారని తెలిసి ఇద్దరు పాత్రికేయులు కార్యాలయానికి వెళ్లి ఇదేమిటని ప్రశ్నించగా అక్కడ దావత్ లో ఉన్న ఫారెస్ట్ అధికారులు, సిబ్బంది, ఓ కౌన్సిలర్ సోదరుడు పాత్రికేయుల పట్ల దురుసుగా ప్రవర్తించినట్లు సమాచారం. వీడియో తీస్తున్న ఓ పాత్రికేయుని చేయి మడిచి వీడియో ఎందుకు తీసుకున్నారని దురుసుగా ప్రవర్తించినట్లు తెల్సింది.

