*పద్మశాలీలు చట్టసభల్లో రాణించాలి..

*పద్మశాలీలు చట్టసభల్లో రాణించాలి..

IMG-20240929-WA0016

*పద్మశాలీలు చట్టసభల్లో రాణించాలి...*
*విద్యార్థుల ప్రతిభ పురస్కారం ప్రధాన ఉత్సవంలో అడిషనల్ కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్, మాజీ ఎమ్మెల్సీ ఆర్, సత్యనారాయణ* 

చురకలు విలేఖరి 
*కరీంనగర్ :-*
*పద్మశాలీలు చట్టసభలో రాణించాలని పెద్దపల్లి అడిషనల్ కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్, మాజీ ఎమ్మెల్సీ ఆర్ సత్యనారాయణ, కొత్తపెళ్లి మునిసిపల్ చైర్ పర్సన్ రుద్రరాజు అన్నారు. కరీంనగర్ పట్టణంలోని పద్మశాలి ఫంక్షన్ హాల్ లో పద్మశాలి విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు, పద్మశాలి ఉద్యోగులకు పద్మకుల రత్న పురస్కారాలను జిల్లా పోపా అధ్యక్షుడు పోలు సత్యనారాయణ అధ్యక్షతన ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో వారు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో ఉంటున్న నిరుపేద పద్మశాలీలను విద్యార్థులను ప్రతిభను వెలికి తీసేందుకు జిల్లా పద్మశాలి పోపా సంఘం ఆధ్వర్యంలో ప్రతిఏటా బహుమతుల ప్రధానోత్సవం ప్రతిభ పురస్కారం అందజేయడం అభినందనీయమన్నారు. విద్యార్థులు చదువుపై ప్రత్యేక దృష్టి సారించి తల్లిదండ్రులు కలలు గన్న ఆశయాల కోసం కృషి చేయాలన్నారు. నేటి యువత సెల్ ఫోన్ వాడకంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని, విద్యార్థులు సెల్ఫోన్ వాడకాన్ని తగ్గించి చదివి పై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. తల్లిదండ్రులు విద్యార్థుల అవలంబిస్తున్న విధానాలను తరచూ పరిశీలించాలన్నారు. ప్రతి ఏటా పోపా ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలను అందజేయడంతో విద్యార్థుల్లో స్ఫూర్తి నింపుతుందన్నారు. నేడు పద్మశాలి కులవృత్తి కనుమరుగ అయ్యే పరిస్థితి నెలకొందని, కేవలం చదువుపైనే ఆధార పడాల్సిన పరిస్థితి పద్మశాలి కులస్తులకు ఏర్పడిందన్నారు. చదువు ఒక్కటే ఉపాధి కల్పిస్తుందని నమ్మకంతోనే పద్మశాలీలు చదువుపై దృష్టి సారిస్తున్నారని పేర్కొన్నారు*. 
*చట్టసభల్లో పద్మశాలీలు రాణించాలి* 
*పద్మశాలీలు అన్ని రంగాలతో పాటు చట్టసభల్లో రాణించాల్సిన అవసరం ఉందని పలువురు పద్మశాలి సంఘ నాయకులు పేర్కొన్నారు. పోపా జిల్లా అధ్యక్షుడిగా ఉన్న పోలు సత్యనారాయణ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా బరిలో ఉండాలని సమావేశంలో పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పద్మశాలి సంఘం తోపాటు అనుబంధ సంఘాలు ఎమ్మెల్సీగా బరిలో ఉంటే పూర్తిస్థాయిలో గెలుపు కోసం కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. అనంతరం జిల్లాలోని ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు జ్ఞాపికలు నగదు తో పాటు ప్రశంస పత్రాలను అందజేశారు.  ఈ కార్యక్రమంలో పోపా ఉపాధ్యక్షుడు గడ్డం శ్రీరాములు ప్రధాన కార్యదర్శి ఎలిగేటి మల్లికార్జున్, జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షుడు వెతుకు సత్యం, గౌరవ అధ్యక్షుడు వాసాల రమేష్, పోలీసుల సంక్షేంక సంఘం జిల్లా అధ్యక్షుడు మామిడాల సురేందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి వొల్లాల కృష్ణహరి, అడేపు శ్రీనివాస్, దుస మునీందర్ దండే రాజశేఖర్,గాలి సత్యనారాయణ, చంద్రశేఖర్, పోప కార్యవర్గ సభ్యులు, పద్మశాలి సంఘం జిల్లా నాయకులు పాల్గొన్నారు.*

Tags:

Related Posts